కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా హీరోయిన్ రీతూ వర్మ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. స్వాగ్ లాంటి మంచి కథని నమ్మి సినిమాని నిర్మించిన మా నిర్మాత విశ్వప్రసాద్ గారికి థాంక్ యూ. పీపుల్ మీడియా ఫాక్టరీలో వర్క్ చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. ఈ సినిమా నా గత సినిమాలకి చాలా డిఫరెంట్ గా వుంటుంది. నా క్యారెక్టర్స్ కొత్తగా వుంటుంది, నన్ను నమ్మిన మా డైరెక్టర్ హసిత్ కి థాంక్ యూ” అని అన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “శ్రీవిష్ణు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. తన హార్డ్ వర్క్ చూసి చాలా ఇన్స్ పైర్ అయ్యాను. విష్ణు, హసిత్ తో కలసి వర్క్ చేయడం ప్రతి రోజు మెమరబుల్. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా థాంక్ యూ. పెళ్లి చూపుల తర్వాత వివేక్ సాగర్ తో నా సెకండ్ కొలాబరేషన్. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అక్టోబర్ 4న థియేటర్స్ కి వస్తుంది. అందరూ చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: