కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్గా జరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. “శ్రీ విష్ణు, వివేక్ నాకు గురు సమానులు. వాళ్ల సపోర్ట్ తోనే ఈ జర్నీ కంటిన్యూ చేస్తున్నాను. కథను నమ్మి సినిమాని చేసే ప్రొడ్యూసర్ విష్ణు ప్రసాద్ గారు. రాజరాజ తర్వాత సెకండ్ ఫిల్మ్ వారి నిర్మాణంలోనే చేయడం చాలా ఆనందంగా ఉంది. విశ్వ గారు గడ్సీ ప్రొడ్యూసర్. చాలా సపోర్ట్ చేశారు. సినిమాకి కావాల్సింది ఎక్కడ రాజీ పడకుండా సమకూర్చారు” అని తెలిపారు.
ఇక హీరో గురించి ఇలా చెప్పారు.. “కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు. ఆయన హీరో అవ్వాలని ఏ సినిమా చేయలేదు. కథ హీరో అవ్వాలని చేశారు. ఆయన కథానాయకుడిగా చేస్తున్నారు. అక్టోబర్ 4న బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ మూవీని చూడబోతున్నారు. చాలా ఆత్మవిశ్వాసంతో ఈ మాట చెప్తున్నాను. రీతూ గారు చాలా స్ట్రాంగ్ రోల్ చేస్తున్నారు. ఎఫర్ట్ లెస్ గా చేశారు. మీరా జాస్మిన్ గారు మరో గుర్తుండిపోయే క్యారెక్టర్ చేశారు. దక్ష గారు చాలా జెన్యూన్ పర్సన్. శరణ్య గారు ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా హ్యాపీగా ఉంది” అని చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “”నా టెక్నికల్ టీం డైరెక్షన్ టీం కి థాంక్యూ. వివేక్ సాగర్ మ్యూజిక్ దద్దరిల్లుతుంది. వేదరామన్ అద్భుతమైన విజువల్స్ ని ఇచ్చాడు. ఎడిటర్ విప్లవ్ కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటాడు. రషీద్ గారు చాలా అద్భుతమైన ప్రోస్థటిక్ వర్క్ చేశారు. శ్రీ విష్ణు గారు నాలుగు క్యారెక్టర్స్ లో బ్రిలియంట్ గా యాక్ట్ చేశారు. అందరి దగ్గరికి సినిమా వస్తోంది. దసరా అయిపోయిన తర్వాత కూడా ఇంకా చూస్తూనే వుంటారనేది నా నమ్మకం. అక్టోబర్ 4న కలుద్దాం” అని అన్నారు డైరెక్టర్ హసిత్ గోలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























