భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక శనివారం ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా మూడురోజులపాటు జరుగనున్న ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది నటీనటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాని, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అవార్డులను అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఐఫా 2024కు గాను ‘ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా’ అవార్డును అందుకోగా, నందమూరి బాలకృష్ణకు ‘గోల్డెన్ లెగసీ అవార్డు’ లభించింది. ఇక బాలీవుడ్ దిగ్గజం లిరిక్ రైటర్ జావేద్ అక్తర్ చేతుల మీదుగా మెగాస్టార్ ఈ అవార్డును అందుకోగా, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ బాలయ్యకు అవార్డును ప్రదానం చేశారు. అలాగే స్టార్ హీరోయిన్ సమంత వుమెన్ ఆఫ్‌ది ఇయర్ అవార్డును గెలుచుకుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























