ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ కు తోడు సూపర్ మౌత్ టాక్ తెచ్చుకుంది.దాంతో తొలి రోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది.టిక్కెట్ హైక్స్ కు తోడు ఎక్స్ట్రా షో లుకూడా తోడవ్వడం తో మొదటి రోజు ఏకంగా 61.21కోట్ల షేర్ అందుకుంది.అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన రెండో సినిమాగా దేవర రికార్డు క్రీయేట్ చేసింది.ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ 73.90కోట్ల షేర్ తో మొదటి స్థానంలో వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంతకుముందు ప్రభాస్,సలార్ 47.40కోట్ల తో రెండో స్థానంలో ఉండేది.ఇప్పుడు ఆ ప్లేస్ ను భారీ మార్జిన్ తో దేవర ఆక్రమించింది.ఇక ఈరోజు కూడా బుకింగ్స్ అదిరిపోయాయి.ఈ వీకెండ్ లోపు షేర్ 100కోట్ల మార్క్ ను టచ్ చేసేలా వుంది.దాదాపు 120 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా వచ్చే వారంలో ఈజీగా బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.దసరా సెలవులు కూడా అడ్వాంటేజ్ కానున్నాయి.
ఇక ఆచార్య తో తీవ్రంగా నిరాశపరిచిన డైరెక్టర్ కొరటాల శివ దేవర తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు.ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మించాయి.అనిరుధ్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























