ఐఫా అవార్డ్స్ 2024 విన్నర్స్ వీరే..!

IIFA Utsavam 2024 Full Winners List Nani, Vikram, Aishwarya Rai Bachchan and Others

భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక శ‌నివారం ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ రాజ‌ధాని అబుదాబి వేదిక‌గా మూడురోజులపాటు జరుగనున్న ఈ ఈవెంట్‌లో టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది నటీన‌టులు హాజ‌రై సంద‌డి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, నాని, సమంత, రానా త‌దిత‌రులు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ వేడుక‌ల్లో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, హీరో నాని సహా ఎంతోమంది ప్రముఖులు వివిధ అవార్డులను అందుకున్నారు. అలాగే కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వహించిన ‘పొన్నియిన్‌ సెల్వన్’ సినిమా ఏకంగా ఏడు అవార్డుల‌ను దక్కించుకుని సెన్సేషన్ సృష్టించింది. ఈ ఏడాది ఎవ‌రెవ‌రు ఏ కేటగిరీల్లో అవార్డు గెలుచుకున్నారో ఇక్కడ చూద్దాం..

ఐఫా అవార్డ్స్ 2024 టాలీవుడ్ విన్నర్స్ లిస్ట్

  • ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా – మెగాస్టార్ చిరంజీవి
  • ఐఫా గోల్డెన్‌ లెగసీ అవార్డు – బాలకృష్ణ
  • ఐఫా వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – సమంత
  • ఉత్తమ నటుడు – నాని (ద‌స‌రా)
  • ఉత్తమ విలన్‌ – షైన్‌ టామ్‌ (ద‌స‌రా)
  • బెస్ట్ డైరెక్టర్ – అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బ్రహ్మానందం (రంగమార్తాండ)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ – మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి
  • ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా – ప్రియదర్శన్‌

ఐఫా 2024 అవార్డులు గెలుచుకున్న ఇతర భాషల చిత్రాలు, నటీనటులు వీరే..!

  • ఉత్తమ చిత్రం (తమిళం) – జైలర్‌
  • ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ నటి (తమిళం) – ఐశ్వర్యారాయ్ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ దర్శకుడు (తమిళం) – మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) – ఏఆర్‌ రెహమన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ నేపథ్య గాయకుడు – చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ నేపథ్య గాయని – శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ లిరిక్స్‌ – జైలర్‌ (హుకుం)
  • ఉత్తమ సహాయ నటుడు (తమిళం) – జయరామ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)
  • ఉత్తమ విలన్‌ (తమిళం) – ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)
  • ఉత్తమ విలన్‌ (కన్నడ) – జగపతి బాబు
  • ఉత్తమ విలన్‌ (మలయాళం) – అర్జున్‌ రాధాకృష్ణన్‌
  • ఉత్తమ నటి (కన్నడ) – రుక్మిణి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
  • ఉత్తమ నటుడు (కన్నడ) – ర‌క్షిత్ శెట్టి (సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ)
  • ఐఫా ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ) – రిషబ్‌ శెట్టి
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.