మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించగా తారక్ డ్యూయెల్ రోల్స్ పోషించారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అర్ధరాత్రి 1గంటకి బెనిఫిట్ షోలు పడగా, భారీ సంఖ్యలో తారక్ ఫ్యాన్స్ సినిమాను తిలకించేందుకు బారులుతీరారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దేవర మూవీకి ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్‌సీస్‌లో సైతం ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇదిలావుంటే, మరోవైపు హీరో ఎన్టీఆర్ దేవర చిత్రం ప్రమోషన్స్ కోసం యూఎస్ఏ వెళ్లిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీమియర్ షోను ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్‌లో ప్రదర్శించారు.
ఈ మేరకు హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో దేవర స్పెషల్ స్క్రీనింగ్ జరుగగా ఈ కార్యక్రమానికి హీరో ఎన్టీఆర్ హాజరయ్యారు. దీంతో దేవర సినిమాపై అమెరికాలోనూ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో తొలిరోజు అక్కడ కళ్ళు చెదిరే వసూళ్లను అందుకుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ మూవీ దుమ్ము రేపింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం, దేవర చిత్రం ఒక్క ప్రీమియర్స్ తోనే 2,834.329 డాలర్స్ వసూళ్లు సాధించింది.
అలాగే ఓవరాల్ గా మొదటిరోజైన శుక్రవారం 3 మిలియన్ డాలర్స్ అందుకుంది. తద్వారా నార్త్ అమెరికాలో తొలిరోజు వసూళ్ళలో మూడో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. అయితే ఈరోజు, రేపు వీకెండ్ కావడం ఈ సినిమాకు కలిసిరానుంది. ఈ నేపథ్యంలో 5 మిలియన్ డాలర్స్ క్లబ్ పై కన్నేసింది దేవర. మరో రెండు రోజుల్లో ఈ మార్క్ అందుకోవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
కాగా నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రల్లో నటించారు. అలాగే దేవర చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























