మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే అన్ని సినిమా థియేటర్ల వద్ద ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అవుతోంది. అలాగే సోలో హీరోగా ఆయన నటించిన సినిమా విడుదలై ఆరేళ్ళు అవుతోంది. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావారణం నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’ ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే అన్ని సినిమా థియేటర్ల వద్ద ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అవుతోంది. అలాగే ‘అరవింద సమేత..’ తర్వాత సోలో హీరోగా ఆయన నటించిన సినిమా విడుదలై ఆరేళ్ళు అవుతోంది.
దీంతో తారక్ అభిమానులతోపాటు మూవీ లవర్స్ పోటెత్తడంతో థియేటర్ల వద్ద పండుగ వాతావారణం నెలకొంది. ఇక చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా సినిమాను వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన కుటుంబ సభ్యులతో కలిసి దేవరను వీక్షించారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ బాలానగర్‌లోని మైత్రి విమల్ థియేటర్లో ఈ సినిమాను తిలకించారు.
ఈ సందర్భంగా రాజమౌళి థియేటర్ వద్ద తారక్ అభిమానులకు అభివాదం చేశారు. అనంతరం ప్రేక్షకులతో కలిసి దేవర చిత్రాన్ని వీక్షించారు. కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇకఇదిలావుంటే, మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి శ్రీరాములు థియేటర్లో దేవర సినిమాను చూశారు. మొత్తానికి మూవీ లవర్సే కాకుండా సినీ సెలబ్రెటీలు సైతం దేవర సినిమాను చూడటానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























