దేవర.. బియాండ్ ఫెస్ట్‌లో ఎన్టీఆర్‌కు స్టాండింగ్ ఒవేషన్

NTR Receives Standing Ovation During Devara Screening at Beyond Fest

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో నటించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించగా తారక్ డ్యూయెల్ రోల్స్ పోషించారు. భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అర్ధరాత్రి 1గంటకి బెనిఫిట్ షోలు పడగా, భారీ సంఖ్యలో తారక్ ఫ్యాన్స్ సినిమాను తిలకించేందుకు బారులుతీరారు. అయితే ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్‌సీస్‌లో సైతం ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇదిలావుంటే, మరోవైపు హీరో ఎన్టీఆర్ దేవర చిత్రం ప్రమోషన్స్ కోసం యూఎస్ఏ వెళ్లిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీమియ‌ర్ షోను ప్రతిష్ఠాత్మక బియాండ్ ఫెస్ట్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఈ మేరకు హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో దేవర స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది.

అయితే ఈ కార్యక్రమానికి హీరో ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ఆడియెన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చి స్వాగతం పలికారు. కాగా ఈ వేడుకలో తారక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో పలువురు ఎన్టీఆర్ తో మాట్లాడేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు.

అలాగే జపాన్ నుంచి ఓ మహిళ కేవలం ఎన్టీఆర్ ను కలుసుకునేందుకు అమెరికా రావడం విశేషం. బియాండ్ ఫెస్ట్‌లో దేవర చిత్రం స్పెషల్ స్క్రీనింగ్ ఉందని, దీనికి తారక్ హారవుతున్నారని తెలుసుకున్న ఆమె విమాన ప్రయాణం ద్వారా లాస్ ఏంజిల్స్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా తారక్ ని కలిసిన ఆ మహిళ తమ దేశానికి రావాల్సిందిగా ఆహ్వానించగా, అందుకు ఎన్టీఆర్ వస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ ప‌తాకాల‌పై మిక్కిలినేని సుధాక‌ర్‌, హ‌రికృష్ణ‌.కె ఈ సినిమాను నిర్మించారు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర‌ల్లో న‌టించారు. అలాగే దేవర చిత్రంలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, అజ‌య్, గెట‌ప్ శీను త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ర‌త్న‌వేలు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, సాబు శిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.