ఘనంగా సిద్దార్థ్, అదితిరావు వివాహం

Aditi Rao Hydari And Siddharth Get Married, Wedding Pics Gone Viral

మరో సినీ జంట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తెలుగులో బాగా పాపులర్ అయిన తమిళ హీరో సిద్దార్థ్‌ మరియు ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరీ తాజాగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సోమవారం శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో దక్షిణాది సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబ పెద్దలతోపాటు దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వివాహం అనంతరం కొత్త పెళ్లికూతురు అదితిరావు ఈ వేడుక నుండి ఓ అద్భుతమైన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోలో అందమైన రూబీ మరియు బంగారు ఆభరణాలతో గోల్డెన్ ఆర్గాన్జా లెహంగా ధరించి, అదితి ఫోటోలలో సిద్ధార్థ్‌తో ప్రమాణం చేయడాన్ని చూడవచ్చు. వేడుక కోసం సిద్ధార్థ్ సాధారణ కుర్తా మరియు వేష్టిని ఎంచుకున్నాడు.

ఈ సందర్భంగా అదిరావు హైదరీ ఇన్‌స్టాగ్రామ్‌లో.. “నువ్వే నా సూర్యుడు, నా చంద్రుడు మరియు నా నక్షత్రాలన్నీ.. శాశ్వతత్వం కోసం పిక్సీ సోల్‌మేట్స్‌గా ఉండటానికి.. నవ్వడానికి, ఎప్పటికీ ఎదగకుండా.. ఎటర్నల్ లవ్, లైట్ & మ్యాజిక్.. ఇట్లు శ్రీమతి & మిస్టర్ అదు-సిద్ధు” అని భర్త సిద్దార్థ్‌ను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట్‌ పెట్టింది. కాగా ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నూతన వధూవరులకు నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

కాగా గత కొన్నేళ్లుగా సిద్ధార్థ్‌, అదితి రావు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరికీ ఇది ద్వితీయ వివాహం కావడం గమనార్హం. అంతకుముందు సిద్ధార్థ్ మేఘన (మొదటి భార్య) ను 2003లో వివాహమాడాడు. ఆ తర్వాత 2007లో వీరు విడాకులు తీసుకున్నారు. మరోవైపు అదితీ రావు హైదరి కూడా 2002లో హిందీ నటుడు, లాయర్‌ అయిన సత్యదీప్‌ మిశ్రాను పెళ్లి చేసుకోగా.. అనివార్య కారణాలతో వీరు 2012లో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా సిద్ధార్థ్‌, అదితి రావు హైదరీ వివాహం చేసుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.