టాలీవుడ్ ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్ యాక్టర్ సుహాస్ తన గత చిత్రాలు ‘అంబాబీపేట మ్యారేజీ బ్యాండు’, ‘ప్రసన్న వదనం’ లతో ప్రేక్షకులను అలరించాడు. తాజాగా ఆయన వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ హీరోగా ‘జనక అయితే గనక’ మరియు ‘గొర్రె పురాణం’ చిత్రాలలో నటిస్తున్నాడు. అవిరుద్ర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న గొర్రె పురాణం సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టైటిల్ తోనే ఈ చిత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అనంతరం సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పాటలు సహా ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గొర్రె పురాణం సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. దీంతో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచుతున్నారు. దీనిలో భాగంగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా గొర్రె పురాణం ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తే, సుహాస్ ఎదో కేసులో ఇరుక్కుని జైలు జీవితం గడుపుతున్నట్టు అర్ధమవుతోంది. గొర్రె రక్షక్ అనే పేరుతో జంతువులను వధించొద్దు అనే ఉద్యమం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కథ మొత్తం ఒక గొర్రె చుట్టూ తిరుగుతూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
కాగా ఈ చిత్రం ఈనెల 20వ తేదీన విడుదలకానుంది. ఇక ఇదిలావుంటే, మరోవైపు సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించిన జనక అయితే గనక సినిమా కూడా త్వరలోనే గ్రాండ్గా విడుదల కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























