టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శ్రీ సింహా కోడూరి, సత్య లీడ్ రోల్స్‌లో నటించిన లేటెస్ట్ మూవీ ‘మత్తు వదలరా 2’. రితేష్ రానా దర్శకత్వం వహించాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీంతో ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్.. ఇలా ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మత్తు వదలరా 2 శుక్రవారం ప్రేక్షకులముందుకు వచ్చింది. ముందురోజు స్పెషల్ ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ అంచనాలకు మించి హిట్ అయింది. హీరో శ్రీ సింహా సైడ్ కిక్‌గా సత్య పండించిన కామెడీ బాగా ప్లస్ అయింది సినిమాకు. హీరోతో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కించుకున్న సత్య తనలోని విశ్వరూపం చూపించాడని ఆడియెన్స్ చెబుతున్నారు.
మూవీ ఆద్యంతం హిలేరియస్‌గా ఉందని మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో అన్ని థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ క్రమంలో మత్తు వదలారా 2పై మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబులు స్పెషల్ రివ్యూస్ ఇచ్చారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఈ స్టార్ హీరోలు.. శ్రీ సింహా కోడూరి, సత్యల నటనపై ప్రశంసలు కురిపించారు. అలాగే చిత్ర ఘనవిజయంపై మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వారు తమ స్పందనను తెలియజేశారు.
ఇక మత్తు వదలరా 2 చిత్రంలో సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం సమకూర్చగా.. సురేష్ సారంగం సినిమాటోగ్రఫీ, కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ అందించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: