మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్న కాంత నిన్న లాంచ్ అయ్యింది.ఈసినిమాకు రానా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేయనుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించనుంది.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా రానుంది.రానా తో పాటు దుల్కర్ సల్మాన్ ఈసినిమాను నిర్మించనున్నారు.త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుండగా పాన్ ఇండియా మూవీ గా వచ్చే ఏడాది విడుదలకానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం దుల్కర్ తెలుగులో నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్.ఇప్పటివరకు ఈసినిమా నుండి టీజర్ తోపాటు రెండు పాటల విడుదలకాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.నిజానికి గత వారమే ఈసినిమా విడుదలకావాలి కానీ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.కొత్త డేట్ ప్రకారం అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది.వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ -సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.
ఇక గత ఏడాది సీతారామంతో వచ్చి బిగెస్ట్ హిట్ కొట్టాడు దుల్కర్ సల్మాన్.ఈసినిమాతో తనకు ఇక్కడ కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది.రీసెంట్ గా దుల్కర్, కల్కి లోకూడా కనిపించాడు.ఆసినిమా కూడా బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.మరి ఈ లక్కీ భాస్కర్ అతనికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























