మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ యదు వంశీ దర్శకత్వం వహించాడు. ఇక నిహారిక సమర్పణలో తొలిసారిగా ఒక మూవీ రావడంతో ఈ కమిటీ కుర్రోళ్ళుపై మంచి అంచనాలే నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనికితోడు విడుదలకు ముందే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, లిరికల్ సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్‌కు చాలా మంచి స్పందన రావడంతో మూవీపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఫ్రెండ్ షిప్ డే వీక్ సందర్భంగా ఆగస్ట్ 9న విడుదలయిన విషయం తెలిసిందే. అంచనాలకు తగ్గట్టే థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది. ఈ క్రమంలో తాజాగా కమిటీ కుర్రోళ్ళు చిత్రం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.
త్వరలో ఈ మూవీ ఓటీటీ లోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 12నుంచి కమిటీ కుర్రోళ్ళు చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు సదరు ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియాలో తెలిపింది. సో మూవీ లవర్స్.. గెట్ రెడీ, థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయినవారు త్వరలో ఇంట్లోనే కూర్చుని వీక్షించే అవకాశాన్ని పొందండి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: