నందమూరి బాలకృష్ణ తనయుడు తారక రామ మోక్షజ్ఞ తేజ సినిమాలలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ‘హనుమాన్’ ఫేమ్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం చేయనున్నాడు. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఎప్పటినుంచో దీనికోసం ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు తాజా ప్రకటనతో ఫుల్ ఖుషి అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో దీనిపై స్పందించారు టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్. మోక్షజ్ణకు ఆయన వరుసకు సోదరుడన్న విషయం తెలిసిందే కదా. సోషల్ మీడియా వేదికగా తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తారక్.. మోక్షజ్ఞ సినిమాలలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, మోక్షుపై తమ తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు ఉంటాయని చెప్పారు.
ఈ మేరకు ఎక్స్‌లో ఇలా తెలిపారు ఎన్టీఆర్.. “మోక్షజ్ఞ.. సినిమా ప్రపంచంలోకి ప్రవేశించినందుకు నీకు అభినందనలు! నీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత గారితో పాటు అన్ని దైవిక శక్తులు నీపై ఆశీర్వాదాలను కురిపిస్తాయి! హ్యాపీ బర్త్ డే మోక్షు” అని అందులో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం తారక్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సోదరుల మధ్య అనుబంధాన్ని చూసి నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్)లో భాగంగా రూపొందుతుండటం గమనార్హం. విశేషమేంటంటే.. ఇందులో బాలకృష్ణ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. SLV సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందుతోన్న ఈ సినిమాను బాలకృష్ణ చిన్న కుమార్తె ఎం తేజస్విని సమర్పణలో నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక పీవీసీయూతో మోక్షజ్ఞ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుండటంతో, ఇంకా మొదలుకాకముందే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: