నటీనటులు : నివేదా థామస్,విశ్వదేవ్ రాచకొండ,ప్రియదర్శి,గౌతమి
ఎడిటింగ్ : ప్రసన్న
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మిరెడ్డి
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం :నందకిషోర్
నిర్మాతలు : సృజన్,సిద్దార్థ్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువ హీరోయిన్ నివేదా థామస్ తల్లి పాత్రలో నటించిన చిత్రం 35 చిన్నకథ కాదు.మిడిల్ క్లాస్ బయోపిక్ గా తెరకెక్కిన ఈసినిమా విడుదలకు ముందు ప్రచార చిత్రాలతో ఆకట్టుకుంది.ఇక ఈసినిమాకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో అంచనాలు మొదలయ్యాయి.రానా సపోర్ట్ చేశాడంటే అందులో విషయం వుండే ఉంటది.దాంతో సినిమా చూడాలన్న ఆసక్తి క్రియేట్ అయ్యింది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో రెండు రోజుల ముందు నుండే ప్రీమియర్స్ కూడా వేశారు.చూసిన వారు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు.మరి ఈసినిమా ఎలా వుంది? ఈ 35 కథేంటో చూద్దాం.
కథ :
భార్యాభర్తలు అయినా సర్వసతి (నివేదా థామస్ ),ప్రసాద్ (విశ్వదేవ్) కు ఇద్దరు పిల్లలు అరుణ్,వరుణ్.ఇందులో చిన్నోడైన వరుణ్ చదువులో పర్లేదు కానీ పెద్దోడు అరుణ్ లెక్కల్లో చాలా వీక్.లెక్కల మాస్టారు చైతన్య (ప్రియదర్శి) చెప్పేది అరుణ్ కు ఎక్కకపోగా తనే లాజిక్ గా ప్రశ్నలు వేస్తువుంటాడు.దాంతో చైతన్య,అరుణ్ కి జీరో అని పేరు పెట్టి చివరి బెంచ్ కి పంపిస్తాడు.అయితే అరుణ్ వరసగా లెక్కల్లో ఫెయిల్ అవుతుండడంతో ఓ క్లాస్ డిమోట్ అయ్యి తన తమ్ముడు వరుణ్ క్లాస్ లో కూర్చోవాల్సి వస్తుంది.ఇక లెక్కల్లో అరుణ్ ఈసారి కనుక 35 మార్కులు తెచ్చుకోకుంటే స్కూల్ నుండి పంపించే పరిస్థితి ఎదురవుతుంది.మరి ఆతరువాత ఏమైంది ? అరుణ్ 35 తెచ్చుకున్నాడా ?అరుణ్ కోసం టెన్త్ ఫెయిల్ అయిన సర్వసతి ఏం చేసింది అనేదే మిగితా కథ.
విశ్లేషణ :
35 మార్కులు అనే పాయింట్ తో పిల్లల కథను అలాగే అమ్మానాన్నల కథ ను మిక్స్ చేసి మిడిల్ క్లాస్ లైఫ్ ను తెర మీదకు తీసుకొచ్చాడు దర్శకుడు నందకిశోర్. అర్థవంతమైన మాటలతో అనవసరమైన కమర్షియల్ అంశాల జోలికి పోకుండా ఓమంచి కథను చెప్పాడు.రియల్ లైఫ్ లో మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఎలా వుంటారు పిల్లల కోసం ఏం చేస్తారు అలాగే రియల్ లైఫ్ లో లెక్కల మాస్టరు పిల్లలకు ఎలా కనిపిస్తాడు ఇవన్నీ బాగా చూపెట్టాడు.
అయితే కథలోకి వెళ్ళడానికి కొంచెం సమయం తీసుకున్నాడు.ఇక్కడ కొంచెం సాగదీతగా అనిపించినా ఒక్కసారి కథలోకి ఎంటర్ అయ్యాకా పాత్రలతో కనెక్ట్ అవుతాం.ఫస్ట్ హాఫ్ లో సరస్వతి-ప్రసాద్ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.కొడుకుకి 35 మార్కులు రావడాననికి తల్లి చేసే పనులు సూపర్ అనిపిస్తాయి.టెన్త్ ఫెయిల్ అయిన తల్లి మళ్ళీ కొడుకు కోసం బుక్స్ పట్టడం,జీరో అనుకున్న కొడుకును హీరో చేయడం అలాగే చివర్లో తండ్రి మార్కులు చదివే సన్నివేశాలు ఇవన్నీ సినిమాలో హైలైట్ అయ్యి ఈ35 చిన్న కథ కాదు ఓ మంచి కథలా ముగుస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే కాస్టింగ్ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది.తల్లి పాత్రలో నివేదా థామస్ అదరగొట్టింది.తన కెరీర్ లో ఇది బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు.భావోద్వేగాలను అద్భుతంగా పండించింది.ఇక యువ నటుడు విశ్వదేవ్ తండ్రి పాత్రలో చాలా బాగా చేశాడు.తన నటన చాలా సహజంగా అనిపించింది.ప్రియదర్శి మాథ్స్ టీచర్ గా మెప్పించాడు.ముఖ్యంగా పిల్లలు అద్భుతం అని చెప్పొచ్చు.వరుణ్ పాత్ర చేసిన పిల్లాడు అదరగొట్టాడు.మిగితా పాత్రల్లో నటించిన భారతి రాజా,గౌతమి వారి పాత్రల పరిధి మేర చేశారు.
టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా వుంది.సినిమాటోగ్రఫీ మిడిల్ క్లాస్ లైఫ్ ను ప్రతిబింబించింది.ఎడిటింగ్ కూడా ఓకే.సంగీతం డీసెంట్ గా వుంది.ఇందులో చాలా పాటలే వున్నాయి.అన్ని కథలోనుండి వచ్చేవే.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కథకు సరిపడేలా వుంది.నిర్మాతలు సినిమాను క్వాలిటీతో నిర్మించారు.
ఓవరాల్ గా 35 చిన్న కథ కాదు అంటూ వచ్చిన ఈసినిమా అందరు చూసే కథ తో మెప్పించింది అని చెప్పొచ్చు.కథ ,నటీనటులు,డైరెక్షన్,మాటలు సినిమాలో హైలైట్ అయ్యాయి.ఫ్యామిలీతోపాటు చూసే ఓ మంచి సినిమా ఈ 35 చిన్న కథ కాదు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: