మాలీవుడ్‌లో మొదలైన వివాదం నెమ్మదిగా అన్ని చిత్ర పరిశ్రమలకూ వ్యాపిస్తోంది. సినిమా రంగంలో మహిళలు ఎదర్కొంటున్న లైంగిక దాడులు, శ్రమ దోపిడి సహా పలు సమస్యలు గురించి జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక మలయాళ పరిశ్రమలో అగ్గి రాజేసింది. కేరళ ప్రభుత్వానికి ఈ కమిటీ ఇచ్చిన నివేదిక వెలుగుచూసిన అనంతరం పలువురు హీరోయిన్స్ ఇండస్ట్రీలో తాము ఎదుర్కొన్న అనేక సంఘటనలను మీడియాకు వెల్లదించడమే కాకుండా బాధ్యులపై కేసులు కూడా పెడుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వివాదం ఇప్పుడు అన్ని చిత్రపరిశ్రమలను కుదిపేస్తోంది. కోలీవుడ్, శాండల్ వుడ్, బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీలలో జరుగుతున్న అన్యాయాలపై ఒక్కొక్కరు క్రమంగా గళం ఎత్తుతున్నారు. కొందరు సీనియర్ హీరోయిన్స్ సైతం పరిశ్రమలో తాము లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలియజేస్తున్నారు. దీంతో హేమ కమిటీ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే స్టార్ హీరోయిన్ సమంత కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలాంటి కమిటీ ఒకటి వేయాలని ప్రభుత్వానికి సూచించారు.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై టాలీవుడ్ కూడా స్పందించింది. ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ఈ అంశంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. అందులో మహిళల భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపిన ఆయన.. ప్రభుత్వ పరంగా కూడా ఓ ఉన్నతస్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మేరకు విష్ణు సోషల్ మీడియాలో వెల్లడించారు.
“తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహిళల భద్రత మరియు ప్రాతినిధ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ‘మా’ అధ్యక్షుడిగా, నేను గౌరవనీయులైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మరియు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిని అధికారికంగా అభ్యర్థించాను. కెమెరా ముందు మరియు వెనుక అందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం మా ప్రాధాన్యత. ‘మా’ నిరంతర అభివృద్ధికి కట్టుబడి ఉంది. అలాగే మహిళల భద్రత మరియు సాధికారత కోసం మా పరిశ్రమను బెంచ్‌మార్క్‌గా మార్చడానికి అందరి నుండి సూచనలను స్వాగతిస్తోంది” అని ఆ లేఖలో పేర్కొన్నారు విష్ణు మంచు.
ఇక సినిమాల విషయానికొస్తే.. విష్ణు టైటిల్ రోల్‌లో కనిపించనున్న ‘కన్నప్ప’ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా రాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























