అప్పడు మహేష్ బాబుతో.. ఇప్పుడు విజయ్‌తో

GOAT Actress Meenakshi Chaudhary Compares Work Styles of Mahesh Babu and Vijay

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా.. ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్.సురేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో నేషనల్ వైడ్‌గా ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘The GOAT’ సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ మీనాక్షి చౌదరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

విజయ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

విజయ్ గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. విజయ్ గారు పాలిటిక్స్‌కి ఎంటర్ అయ్యే ముందు చేసిన లాస్ట్ సినిమా ఇది. ఈ అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. సినిమా రిలీజ్ కోసం చాలా ఎక్సయిటింగ్‌గా ఎదురుచూస్తున్నాను.

ఈ ప్రాజెక్ట్‌లోకి ఎలా వచ్చారు?

డైరెక్టర్ వెంకట్ ప్రభు గారు ఈ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయ్యారు. లుక్ టెస్ట్ చేసిన తర్వాత క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అని సెలెక్ట్ చేశారు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా వుంటుంది?

నాది యంగ్ మోడరన్, కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్. వెరీ ఫన్ అండ్ లవింగ్‌గా వుంటుంది. నా పర్శనల్ లైఫ్ లో కూడా రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఒక లేయర్ వుంటుంది. కథలో నా క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్ వుంటుంది. సినిమా చాలా ఎక్సయిటింగ్‌గా వుంటుంది.

మహేష్ బాబు గారితో వర్క్ చేశారు, ఇప్పుడు విజయ్ గారితో చేశారు.. వారి మధ్య ఎలాంటి పోలికలు కనిపించాయి?

ఈ ఇద్దరితో వర్క్ చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఇద్దరూ చాలా క్రమశిక్షణ గల హీరోలు. సెట్స్‌లో అందరినీ సమానంగా గౌరవిస్తారు. వారితో వర్క్ చేయడం లైఫ్ టైమ్ ఆపర్చ్యూనిటీ.

గోట్‌లో స్నేహ, లైలా లాంటి సినియర్స్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?

స్నేహ, లైలా లాంటి సినియర్స్‌తో వర్క్ చేయడం గ్రేట్ లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. కెరీర్ బిగినింగ్ లోనే ఇలాంటి అవకాశం రావడం ఆనందంగా వుంది. అందరూ నన్ను చాలా కేర్‌గా చూసుకున్నారు.

డైరెక్టర్ వెంకట్ ప్రభు గారి గురించి?

వెంకట్ ప్రభు గారు కూల్ పర్సన్. చిల్‌గా వుంటారు. ఆయన ఫిల్మ్ మేకింగ్ యూనిక్‌గా వుంటుంది. చాలా సపోర్టివ్‍గా వుంటారు. ఆయనతో వర్క్ చేయడం వెరీ న్యూ ఎక్స్‌పీరియన్స్.

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం వెనుక స్పెషల్ ప్లాన్ ఉందా?

స్పెషల్ ప్లాన్ అంటూ ఏమీ లేదండి. ఇందులో 2023లో సైన్ చేసిన సినిమాలు కూడా వున్నాయి. లక్కీ భాస్కర్, మెకానిక్ రాకీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్‌కి రావడం కో-ఇన్సిడెంట్. ఇలాంటి మంచి సినిమాలలో పార్ట్ కావడం చాలా ఆనందంగా వుంది.

మీ సినిమాల ఎంపిక ఎలా వుంటుంది?

స్క్రిప్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కథ నచ్చితే తర్వాత నా క్యారెక్టర్ గురించి చూస్తాను. డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలని ఇష్టపడతాను.

మట్కా పిరియడ్ ఫిలిం, అందులో నాది వెరీ డిఫరెంట్ అవతార్. మొకానిక్ రాకీలో మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపిస్తా. లక్కీ భాస్కర్‌లో మదర్ రోల్ ప్లే చేశా. అనిల్ రావిపూడి సినిమాలో కాప్ రోల్ చేస్తున్నాను. ఇవన్నీ దేనికవే స్పెషల్‌గా వుంటాయి.

ఆల్ ది బెస్ట్..

థాంక్ యూ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.