చైతన్య 15 ఇయర్స్ జర్నీ.. తండేల్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్

Thandel Team Released Naga Chaitanya New Poster as He Completed 15 Years in TFI

అక్కినేని మూడో తరం వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 2009లో తొలిసారిగా ‘జోష్‌’ మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన అప్పటినుంచీ ఇప్పటివరకూ 22 సినిమాలలో హీరోగా నటించారు. ఘనవారసత్వం ఉన్నా తన ప్రతిభతో విలక్షణమైన పాత్రలలో అనేక సూపర్ హిట్‌లను అందించి మోస్ట్ సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా ఎదిగారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా.. నాగ చైతన్య మోస్ట్ ఎవైటెడ్ మూవీ తండేల్ మేకర్స్ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రగ్గడ్ అవతార్‌లో కనిపించిన నాగ చైతన్య తన చిరునవ్వుతో కట్టిపడేశారు. చైతు సముద్రం దగ్గర ఫిషింగ్ బోట్ మీద నిలబడి కనిపించిన ఈ పోస్టర్ అదిరిపోయింది. చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ సినిమాని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. అలాగే జాతీయ అవార్డు విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌గా, శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.