దేవర ఆడియో సాంగ్స్ యూట్యూబ్ లో వ్యూస్ పరంగా అదరగొడుతున్నాయి.ఇంతకుముందు వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సింగిల్ లాంగ్వేజ్ లోనే 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకొని చార్ట్ బాస్టర్ అయ్యింది.అలాగే ఫస్ట్ సాంగ్ ఫియర్ అన్ని భాషల్లో కలుపుకొని 70మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకుంది.ఇక ఈసినిమా నుండి నిన్న మూడో పాట దావూదీని రిలీజ్ చేశారు.ఈసాంగ్ కూడా రెస్పాన్స్ అదిరిపోతుంది.24గంటల్లో అన్నిభాషల్లో కలిపి 30మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.త్వరలోనే ఈసాంగ్ కూడా 100మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.వచ్చే వారంలో ఈ అప్డేట్ గురించి క్లారిటీ రానుంది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.దేవర రెండు భాగాలుగా రానుండగా ఫస్ట్ పార్ట్ ఈనెల 27న విడుదలకానుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో పాల్గొనడానికి రెడీ అవుతున్నాడు.పాన్ ఇండియా సినిమా కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర రిలీజ్ తరువాత ఎన్టీఆర్ ,వార్ 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు.అటు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ సినిమా చేయాల్సివుంది.డిసెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ కానున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించనుండగా 2026 జనవరి 9న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: