ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు ప్రస్తుతం ప్రకృతి విపత్తుతో అల్లాడుతున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తి చాలా ప్రాంతాలు జల దిగ్బంధం అయ్యాయి. ఈ విపత్తు వలన వేలాదిమందికి నీడ లేకుండాపోయింది. కొన్ని జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో అక్కడి ప్రజలకు గత మూడు రోజులుగా సరైన ఆహారం కూడా అందుబాటులో లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మురంగా సహాయ చర్యలను కొనసాగిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ తనవంతు సాయంగా ఒక్కోదానికి రూ.50 లక్షలు చొప్పున రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.1 కోటి భారీ సాయం ప్రకటించారు. మరోవైపు ఈ వారాంతం వరకూ ‘ఆయ్ సినిమా’ కలెక్షన్ల నుంచి నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని గీతా ఆర్ట్స్ సంస్థ, నిర్మాత బన్నీ వాస్ ప్రకటించారు.
ఇక అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కి రూ.25 లక్షల సాయం అందజేస్తున్నట్టు తెలిపింది. అలాగే హారిక అండ్ హాసిని బ్యానర్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరపున నిర్మాత నాగవంశీ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాలను వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నారు.
వీరితోపాటుగా యంగ్ హీరోలు ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ రూ.30 లక్షలు (ఏపీకి రూ.15 లక్షలు + తెలంగాణకు రూ.15 లక్షలు), విశ్వక్ సేన్ రూ.10 లక్షలు (ఏపీకి రూ.5 లక్షలు + తెలంగాణకు రూ.5 లక్షలు) అందజేశారు. డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా ఈ విపత్తుపై స్పందించి సాయం అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: