సుహాస్ సినిమా అంటే.. మినిమం గ్యారెంటీ

Producer Dil Raju Reveals Interesting Facts About Janaka Aithe Ganaka

వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘జనక అయితే గనక’ సెన్సార్ అయింది. యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆల్రెడీ టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. సుహాస్ తన ప్రతీ సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూనే ఉన్నాడు. కొత్త కథలను చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఓ మామూలు స్థాయి నుంచి వచ్చి ఇప్పుడు ఆయన ఎంచుకుంటున్న కథలు, స్క్రిప్ట్‌లు చాలా గొప్పగా ఉన్నాయి. సుహాస్ అంటే మినిమం గ్యారెంటీ అని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు కూడా చెబుతున్నారు” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “దిల్ రాజు ప్రొడక్షన్ అంటే ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే ఉంటుంది. కాకపోతే ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. కాస్త పక్కకు జరిగి ఈ కథను చేసినా ఆ లైన్ దాటకుండా తీశాం. ఆడియెన్స్‌ను ఎడ్యుకేట్ చేసేలా ఉంటుంది. సినిమా గురించి నేను తక్కువ మాట్లాడతాను. సినిమానే ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. విజయ్ బుల్గానిన్ మంచి పాటలు ఇచ్చారు. మలయాళీ అమ్మాయి అయినా తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చెప్పారు” అని తెలిపారు.

“చిన్న చిత్రాలకు ప్రీమియర్లు బాగానే కలిసి వస్తున్నాయి. ఈ పెయిడ్ ప్రీమియర్లు అనేది కూడా ఓ స్ట్రాటజీనే. మేం సెప్టెంబర్ 6న ప్రీమియర్లు వేస్తున్నాం. మంచి చిత్రాన్ని ఇస్తే ఆడియెన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. మీడియా, ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా? అని వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా మాత్రం ఆద్యంతం నవ్వించేలా ఉంటుంది. ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు అనే ఆలోచనతో థియేటర్ నుంచి బయటకు వస్తారు” అని అన్నారు దిల్ రాజు.

కాగా ఈ సినిమాలో సుహాస్‌కు జోడీగా సంగీర్తన ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. రాజేంద్ర ప్ర‌సాద్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, గోప‌రాజు, ర‌ఘుబాబు, పృథ్వీ, శివ‌న్నారాయ‌ణ‌, రూప‌ల‌క్ష్మి, విజ‌య‌లక్ష్మి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూరుస్తుండగా.. సాయి శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ, కోదాటి పవన్‌ కల్యాణ్‌ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు.

అలాగే ప్రొడక్షన్‌ డిజైనర్‌గా అరసవిల్లి రామ్‌కుమార్‌, కాస్ట్యూమ్ డిజైనర్‌గా భరత్‌ గాంధీ పనిచేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ యుఎస్‌ఏ థియేట్రికల్ హక్కులను హీరో సుహాస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే మరోవైపు సుహాస్ బాబీ దర్శకత్వంలో ‘గొర్రె పురాణం’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.