తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రకృతి విపత్తుతో అతలాకుతలం అవుతున్నాయి. గత మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ వర్షాలకు తోడు ఎగువ రాష్ట్రాలనుంచి వస్తోన్న భారీ వరదల కారణంగా లోతట్టు గ్రామాలూ, పట్టణాలు మునిగిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇలాంటి తరుణంలో తెలుగు రాష్ట్రాలకు సాయం అత్యవసరం. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బాధితులను పునరావాసాలకు తరలించడం, ఆహార పొట్లాలు అందించడం వంటివి విరివిగా చేపట్టాయి. ఈ నేపథ్యంలో తన పెద్ద మనసుని, మానవత్వాన్ని చాటుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఇక ఇటీవలే నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆయన స్వర్ణోత్సవ వేడుకలను జరుపుకున్నారు.
అయితే తనను ఎంతగానో అభిమానించే తెలుగు రాష్ట్రాల ప్రజలు కష్ట సమయంలో ఉన్నప్పుడు వారికి అండగా ఉండటం బాధ్యతగా భావించిన బాలకృష్ణ తన ఉదారతను చాటుకున్నారు. తన వంతు బాధ్యతగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కో దానికి రూ.50 లక్షలు చొప్పున భారీ విరాళం ప్రటించారు. ఈ మొత్తాన్ని ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్నట్టు ఓ పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.
“50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.”
“ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోంది. ఈ విపత్కర పరిస్థితులలో బాధాతప్త హృదయంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు నా బాధ్యతగా బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నాను. రెండు రాష్ట్రాలలో మళ్ళీ అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను – మీ నందమూరి బాలకృష్ణ” అని అందులో పేర్కొన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: