శ్రీ సింహ,కమెడియన్ సత్య,ఫారియా అబ్దులా లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం మత్తు వదలరా 2.ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరాకు సీక్వెల్ గా వస్తుంది.ఫస్ట్ పార్ట్ రిజల్ట్ పక్కన పడితే ఇందులో సత్య కామెడీ ఆకట్టుకుంది.ఇక ఇప్పుడు సీక్వెల్ లో కూడా సత్య ఫ్యాక్టర్ కీలకం కానుంది.ప్రమోషన్స్ లో భాగంగా నిన్న టీజర్ ను కూడా విడుదలచేశారు.ఇక ఈ టీజర్ చాలా మందిని మెప్పించింది.సత్య కామెడీ ఇందులో హైలైట్ అయ్యింది.యూట్యూబ్ లో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్ ను తెచ్చుకొని ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమాకు ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.మైత్రి నుండి వస్తున్న సినిమా కావడంతో థియేటర్లకు ఎలాగూ డోకా ఉండదు.ఇక ఈమధ్య కాలంలో సత్య కామెడీకి యూత్ బాగా అట్రాక్ట్ అవుతుంది.సో ఈసినిమాలో గనుక సత్యను కరెక్ట్ గా వాడుకుంటే బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయం.
మరి మంచి అంచనాల మధ్య రానున్న ఈసినిమా ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.రితేశ్ రానా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో సునీల్ వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో కనిపించనుండగా కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ 13న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























