దేవర రిలీజ్ కు ఇంకా చాలా రోజుల సమయం వున్నా అప్పుడే యుఎస్ఏ బాక్సాఫీస్ దూకుడు కొనసాగిస్తోంది.అక్కడ కొన్ని లొకేషన్ల లో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా 100k డాలర్ల ప్రీ సేల్స్ జరిగాయి.హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడయ్యాయి.దాంతో ఈసినిమా ప్రీమియర్స్ తోనే సరికొత్త రికార్డులను క్రీయేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.హంసిని ఎంటర్టైన్మెంట్,ప్రత్యంగిరా సినిమాస్ భారీ ధరకు ఓవర్సీస్ హక్కులను దక్కించుకున్నాయి.ఏమాత్రం హిట్ టాక్ వచ్చిన దేవర ప్రభంజనం కొనసాగించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.మూడో సాంగ్ అంతకుమించి వుండనుందట.అన్ని కుదిరితే వినాయక చవితికి రిలీజ్ చేసే ఛాన్స్ వుంది.ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈసాంగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి.సెప్టెంబర్ 27న దేవర ఫస్ట్ పార్ట్ విడుదలకానుంది.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం చేతికి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.త్వరలోనే దేవర ప్రమోషన్స్ లో పాల్గొనున్నాడు.ఎన్టీఆర్ అటు హిందీలో వార్ 2 కూడా చేస్తున్న విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో కూడా జాయిన్ కానున్నాడు.వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈసినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































