వెండితెరకు మరో వారసుడు పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి. రవిశంకర్ కుమారుడు అద్వయ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమాకు ‘సుబ్రహ్మణ్య’ అనే టైటిల్ ఖరారు చేశారు. పాన్ ఇండియా మూవీ సుబ్రహ్మణ్య తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రానికి పి. రవిశంకర్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. కుమారుడు అద్వయ్‌ని హీరోగా పరిచయం చేసేందుకు ఆయన సెకెండ్ టైమ్ మెగాఫోన్ పడుతున్నారు. 20 ఏళ్ల క్రితం ఆయన 2004లో ‘దుర్గి’ అనే కన్నడ సినిమాకు తొలిసారిగా దర్శకత్వం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రొడక్షన్ హౌస్ సుబ్రహ్మణ్య ప్రీ-లుక్‌ను రివిల్ చేసింది.
పోస్టర్ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫాంటసీ వరల్డ్ లోకి స్నీక్ పీక్‌ను అందిస్తుంది. మూవీ ఆర్ట్ వర్క్ గ్రాండియర్‌గా వుంది. ఈ స్పెల్‌బైండింగ్ ప్రీ లుక్ సినిమాపై ఎక్సయిట్‌మెంట్ క్రియేట్ చేసింది. ప్రీమియం లార్జ్ ఫార్మాట్, IMAX థియేటర్‌లలోని ప్రేక్షకులకు అడ్వంచర్ థ్రిల్‌ను అందించడానికి ఈ చిత్రాన్ని బిగ్ ఫార్మాట్‌లో చిత్రీకరిస్తున్నారు.
ఇక ఈ చిత్రం ఇప్పటికే 60% నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ గ్రాండ్ ప్రాజెక్ట్ విజువల్ అండ్ ఎమోషనల్ ట్రీట్‌గా అద్భుతమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దీనిలో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయి. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రముఖ స్టూడియోలలో VFX & CGI పనులు జరుగుతున్నాయి.
సుబ్రహ్మణ్య సినిమా టెక్నికల్‌గా ఉన్నతంగా ఉండబోతుంది. దీనికి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. కెజిఎఫ్, సాలర్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఎడిటర్‌గా విజయ్ ఎం కుమార్, సప్త సాగరదాచే & చార్లీ 777 ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
సోషియో-ఫాంటసీ అడ్వెంచర్ జానర్‌లో నిర్మాతలు తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ‘గుణ 369’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీని నిర్మించిన ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2గా ఇది తెరకెక్కుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























