కూలీలో జాయిన్ అయిన శృతి హాసన్ 

shruti haasan joining the cast of Coolie as Preethi

సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ క్యాస్టింగ్ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెంచేస్తుంది.ఇప్పటికే ఈసినిమాకోసం కింగ్ నాగార్జునను తీసుకున్నారు దాంతో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్,నాగ్ ను ఎలా చుపిస్తాడనేది ఆసక్తిగా మారింది.ఇక ఈరోజు కూలీ నుండి మరో పాత్రను పరిచయం చేశారు.ఆ పాత్రకు శృతి హాసన్ ను తీసుకున్నారు.అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఈసినిమాలో శృతి హాసన్ ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక శృతి హాసన్ చివరగా సలార్ లో కనిపించింది.రీసెంట్ గా లోకేష్ -శృతి కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ ను కూడా చేశారు.ఇక ఇప్పుడు కూలీ కోసం శృతి ని తీసుకున్నారు.రేపు మరో పాత్ర ను పరిచయం చేయనున్నారు.కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా కూలీలో కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్. సో రేపు ఈ పాత్రను పరిచయం చేయనున్నారు.

మొత్తానికి పాన్ ఇండియా వైడ్ గా క్యాస్టింగ్ ను తీసుకొని సినిమాకు హైప్ తీసుకొస్తున్నారు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది కూలీ థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.