మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంటోంది. ఫస్ట్ సింగిల్ ‘ఫియర్ సాంగ్’ మరియు సెకండ్ సింగిల్ ‘చుట్టమల్లె..’ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్. ఈ దేవరలో తారక్ డ్యూయెల్ రోల్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. దేవర వరల్డ్‌వైడ్ డిస్టిబ్యూషన్ రైట్స్ ‘హంసిని ఎంటర్‌టైన్‌మెంట్’ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇప్పటికే సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న క్రమంలో దేవరను హంసిని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనుండటం ఆసక్తి కలిగిస్తోంది.
ఇక ఈ మూవీ కోసం స్టార్ యాక్టర్స్ అండ్ టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో భారీ అంచనాలతో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. కాగా హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తుండగా.. ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: