ఓటీటీ లోకి వచ్చేస్తున్న అల్లు శిరీష్ బడ్డీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Allu Sirish' Buddy OTT Streaming Update

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. ఫాంటసీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్, ప్రిషా సింగ్ రాజేష్ ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించగా.. హిప్‌హాప్ త‌మిళ సంగీతం అందించారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించిన బడ్డీ ఆగస్ట్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బడ్డీ తాజాగా ఓటీటీ లోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ మూవీ హక్కులను దక్కించుకుంది. ఈ క్రమంలో బడ్డీ ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. ఆగస్ట్ 30 నుంచి ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సోషల్ మీడియాలో వెల్లడించింది. తెలుగు సహా తమిళం, మలయాళం మరియు కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుందని తెలిపింది.

బడ్డీ క‌థ ఏంటంటే..?

ఆదిత్య (అల్లు శిరీష్‌) ఒక పైలట్. పల్లవి (గాయత్రి భరద్వాజ్‌) వైజాగ్‌లో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌గా పనిచేస్తుంటుంది. విధి నిర్వహణలో భాగంగా పల్లవి, ఆదిత్య ఒకరికొకరు పరిచయమవుతారు. కొన్ని రోజులకు ప్రేమలో పడతారు. ఈ క్రమంలో ఓ రోజు డ్యూటీలో ప‌ల్ల‌వి చేసిన ఓ పొర‌పాటు వ‌లన ఆదిత్య జాబ్ పోతుంది. అయితే అనూహ్యంగా అదే స‌మ‌యంలో ప‌ల్ల‌వి కిడ్నాప్ చేయబడుతుంది.

ఆ సమయంలో జ‌రిగిన ప్ర‌మాదం కారణంగా ప‌ల్ల‌వి కోమాలోకి వెళ్తుంది. అనంతరం ఆమె ఆత్మ ఓ టెడ్డీబేర్‌లోకి చేరుతుంది. ఆమెను కిడ్నాప్‌ చేసిన ముఠా ఎవరు? ఆ ముఠాకి, హాంకాంగ్‌లో ఉన్న డాక్టర్‌ అర్జున్‌ కుమార్‌ వర్మ (అజ్మల్‌)కూ ఉన్న లింక్ ఏంటి? ప్రాణం ఉండగానే పల్లవి ఆత్మ బయటకెలా వచ్చింది? మళ్ళీ ఆమె ఆత్మ తన శరీరంలోకి తిరిగి వచ్చిందా? పల్లవిని కాపాడటానికి ఆదిత్య ఎలాంటి రిస్క్ చేశాడు? చివరికి ఆదిత్య, పల్లవి ఒకటయ్యారా? లేదా? అన్నదే స్టోరీ.

అవయవాల అక్రమ రవాణా నేపథ్యంలో వారి ఆరాచ‌కాల‌ను ఒక టెడ్డీబేర్‌తో కలిసి హీరో ఎలా పోరాటం చేశాడనేది స్టోరీ లైన్. ఆర్‌ఆర్‌ఆర్‌, జై బాలయ్య, భగవంత్‌ కేసరి సినిమాల రిఫరెన్స్‌లు ప్రేక్షకులను నవ్విస్తాయి. హీరోయిన్ కోమాలో ఉండ‌గా ఆమె బాడీ కోసం వెత‌క‌డం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ సినిమా నచుతుంది. సో.. బడ్డీని థియేట‌ర్ల‌లో మిస్ అయిన‌వారు ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.