వరస విజయాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు హీరో శ్రీ విష్ణు.గత ఏడాది సామజవరగమన తో వచ్చి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టగా ఈ ఏడాది ఓం భీమ్ బుష్ తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు.ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేందుకు సిద్దమవుతున్నాడు ఈహీరో.అందులో భాగంగా తనకు రాజరాజ చోరతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ హసిత్ గోలితో స్వాగ్ అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో శ్రీ విష్ణు డిఫరెంట్ గెటప్ లలో కనబడనున్నాడు.ఇక ఈసినిమా టీజర్ రానుంది.ఈనెల 29న ఈ టీజర్ ను విడుదలచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ హీరోయిన్ మీరా జాస్మిన్,దక్షా నాగర్కర్,శరణ్య ప్రదీప్,సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.ఈఏడాది చివర్లో విడుదలచేసేలా సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ దక్కించుకుంది.మరి ఈసినిమాతో శ్రీ విష్ణు హ్యాట్రిక్ పూర్తి చేస్తాడో చూడాలి.
ఇక ఈసినిమా కాకుండా శ్రీ విష్ణు ప్రస్తుతం మరో మూడు సినిమాలకు సైన్ చేశాడట.అందులో గీతా ఆర్ట్స్ లో ఓ సినిమాను చేయనుండగా కోన వెంకట్ తో ఓసినిమా కమిట్ అయ్యాడు.వీటితోపాటు ఓ హారర్ థ్రిల్లర్ కు కూడా సైన్ చేశాడట.త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: