ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక ‘ఐఫా ఉత్సవం’ (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్‌లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్‌కి అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో గల ప్రతిష్టాత్మక ఎతిహాద్ ఎరీనా ఇండోర్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా.. సెప్టెంబర్ 27వ (శుక్రవారం) తేదీన గ్రాండ్ గా జరుగనుంది. అందులో భాగంగా తెలుగు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలకు సంబంధించి అవార్డులు ప్రకటించనున్నారు. విజేతలకు ప్రముఖుల చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్టార్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ గా వ్యవహరించనున్నారు.
ఇక ఈ సంరంభం కోసం దేశవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమల నుండి అగ్ర తారలు, ఫిల్మ్ మేకర్స్ విచ్చేయనున్నారు. కాగా 2024 ఐఫా అవార్డుల కోసం నామినేషన్స్ ఓపెన్ అయ్యాయి. దీనిలో భాగంగా సౌత్ లోని అన్ని భాషల నుంచి ఈ నామినేషన్స్ పూర్తయ్యాయి. శాండల్‌వుడ్ నుంచి కొన్ని చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు వివిధ కేటగిరీల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఐఫా ఉత్సవం.. శాండల్‌వుడ్ నామినేషన్స్
ఉత్తమ చిత్రం
- ఆచార్ & కో.
- కాటేరా
- కౌసల్యా సుప్రజా రామ
- సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ
- టగరు పాళ్య
ఉత్తమ దర్శకుడు
- సింధు శ్రీనివాస మూర్తి – ఆచార్ & కో.
- శ్రీని – దెయ్యం
- తరుణ్ కిషోర్ సుధీర్ – కాటేరా
- శశాంక్ – కౌసల్యా సుప్రజా రామ
- హేమంత్ ఎం రావు – సప్త సాగరదాచే ఎల్లో- సైడ్ ఎ
ఉత్తమ నటుడు
- శివ రాజ్‌కుమార్ – దెయ్యం
- దర్శన్ తూగుదీప – కాటేరా
- డార్లింగ్ కృష్ణ – కౌసల్యా సుప్రజా రామ
- రక్షిత్ శెట్టి – సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ
- రాజా బి శెట్టి – టోబి
ఉత్తమ నటి
- ఆరాధన – కాటేరా
- మేఘా శెట్టి – కైవా
- రుక్మిణి వసంత్ – సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ
- అమృత ప్రేమ – టగరు పాళ్య
- చైత్ర జె ఆచార్ – టోబి
ఉత్తమ విలన్
- అభిజిత్ – దెయ్యం
- జగపతి బాబు – కాటేరా
- రమేష్ ఇందిర – సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ
- మేఘనా రాజ్ సర్జా – తత్సమ తద్భవ
- శిష్య దీపక్ – వీరం
ఉత్తమ సహాయ నటుడు
- నాగభూషణ NS – కౌసల్యా సుప్రజా రామ
- కుమార్ గోవింద్ – కాటేరా
- అనూప్ రేవణ్ణ – కబ్జా
- చిక్కన్న – రాజమార్తాండ
- గోపాల్ కృష్ణ దేశ్‌పాండే – సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ బి
ఉత్తమ సహాయ నటి
- శృతి – కాటేర
- జాన్వీ రాయల – కైవా
- సుధా బెలవాడి – కౌసల్యా సుప్రజా రామ
- మేఘనా గాంకర్ – శివకి సూరత్కల్ 2
- తారా అనురాధ – టగరు పాళ్య
ఉత్తమ సంగీతం
- ఎ.అంజనీష్ లోకనాథ్ – హాస్టల్ హుడుగారు బేకగిద్దరే
- వి.హరికృష్ణ – కాటేరా
- అర్జున్ జన్య – కౌసల్యా సుప్రజా రామ
- చరణ్ రాజ్ – సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ
- వాసుకి వైభవ్ – టగరు పాళ్య
ఉత్తమ నేపథ్య గాయకుడు
- అజనీష్ లోక్‌నాథ్ – (ప్రొటెస్ట్ సాంగ్ – హాస్టల్ హుడుగారు బెకగిధరే)
- హేమంత్ కుమార్ (మనషేగే బంతు బిట్టు హోగోకే – కాటేరా)
- నిశాంత్ రాయ్ – (శివాని – కౌసల్యా సుప్రజా రామ)
- MC బిజ్జు, కీర్తన్ హోల్లా – (టైటిల్ ట్రాక్- నదియా నదియా – సప్త సాగరదాచే ఎల్లో- సైడ్ ఎ)
- జోగి ప్రేమ్ – (సంబంజా అన్నోడు దొడ్డు కన – టగరు పాళ్య)
ఉత్తమ నేపథ్య గాయని
- వాణి హరికృష్ణ – (అనురాఘవ – కాటేరా)
- ఐశ్వర్య రంగరాజన్ – (నమామి నమామి – కబ్జా)
- శ్రీలక్ష్మి బెల్మన్ను – (కదలాను – సప్త సాగరదాచే ఎల్లో సైఫ్- ఎ)
- ఈషా సుచి (ట్వింకిల్ ట్వింకిల్ – శివాజీ సూరత్కల్ 2)
- మాధురి శేషాద్రి (సూర్యకాంతి – టగరు పాళ్య)
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: