గత ఏడాది లియో తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టాడు దళపతి విజయ్.ఈసినిమా తరువాత తను ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం (ది గోట్)తో రానున్నాడు.ఇందులో డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి పోస్టర్స్ , టీజర్,సాంగ్స్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఇప్పుడు ట్రైలర్ కూడా రానుంది.ఈనెల 17న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లు ఇంట్రెస్టింగ్ గా వున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈసినిమాలో ప్రశాంత్ ,స్నేహ,ప్రభుదేవా,అజ్మల్, లైలా,మీనాక్షి చౌదరీ,యోగిబాబు,వీటీవీ గణేష్, జయరామ్ కీలక పాత్రల్లో నటించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.సెప్టెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.తెలుగులో ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ విడుదలచేస్తుంది.
ఇక ఈసినిమా తరువాత విజయ్ నటించనున్న 69వ సినిమాను హెచ్ వినోత్ డైరెక్ట్ చేయనున్నాడట.అయితే ఈ సినిమా గురించి అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం బయటికి రాలేదు.ది గోట్ రిలీజ్ తరువాతే విజయ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: