ఝాన్సీ లక్ష్మీభాయి, తలైవి ఇలా పవర్ ఫుల్ పాత్రల్లో నటించిన కంగనా రనౌత్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ లేడీ పాత్రలో కనిపించనుంది. కంగనా ప్రధాన పాత్రలో ఎమర్జెన్సీ సినిమా వస్తుంది. అత్యంత శక్తివంతమైన మహిళా ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ అప్పుడు ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈసినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రిలీజ్ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. ఫైనల్ గా జూన్ 14వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పుడే కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కంగనా బీజేపీ తరుపున హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేసి రాజకీయ రంగంలో కూడా విజయాన్ని అందుకుంది. ఇక రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా రిలీజ్ మళ్లీ వాయిదా పడింది. ఫైనల్ గా ఈ సినిమాను సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సాలిడ్ అప్ డేట్ తో వచ్చారు. తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే.. ఇండో – పాక్ టైంలో ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు.. అలాగే భారతదేశంలో చీకటిరోజులుగా పిలువబడే ‘ఎమర్జెన్సీ’ గురించి ఈ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది.
కాగా ఈసినిమాలో కంగనా నటిస్తూనే దర్శకత్వం వహిస్తుంది.. అలానే నిర్మాతగా కూడా తనే వ్యవహరిస్తుంది. మణికర్ణిక ఫిలింస్ బ్యానర్ పై కంగనా ఈసినిమాను నిర్మిస్తుంది. ఇంకా ఈసినిమాలో అనుపమ్ ఖేర్, శ్రేయ తల్పాడే, సతీష్ కౌషిక్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: