టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ #VS13. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ ప్రొడక్షన్ నెం. 8గా ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఎ రియాక్షన్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఇటీవల విశ్వక్ ని ఫెరోషియస్ పోలీసుగా ప్రజెంట్ చేసిన ప్రీ-లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డెబ్యుటెంట్ శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న #VS13లో విశ్వక్ సేన్ హానెస్ట్ IPS ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా చిత్ర యూనిట్‌తో పాటు మరికొందరు ప్రత్యేక అతిధుల సమక్షంలో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాతలు నాగ వంశీ, సాహు గారపాటి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ముహూర్తం షాట్‌కు దర్శకుడు వశిష్ట క్లాప్ ఇచ్చారు. శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశారు. మేకర్స్ అనౌన్స్ చేసిన ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభమవుతుంది. సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కన్నడ బ్యూటీ సంపద కూడా ఈ వేడుకకు హాజరైంది.
విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పోలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుంది. కాగా ఈ చిత్రానికి టాప్-క్లాస్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. తంగలాన్ ఫేమ్ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కాంతార ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక ఈ సినిమాతోపాటు మరోవైపు విశ్వక్ హీరోగా నటిస్తోన్న ‘మెకానిక్ రాకీ’ మూవీ కూడా చిత్రీకరణలో బిజీగా ఉంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























