హరీష్ శంకర్ దర్శకత్వంలోమాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. రవితేజ హిట్ దక్కిందా?లేదా? అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. రవితేజ, భాగ్య శ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్ తదితరులు
బ్యానర్స్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నిర్మాత.. టీజీ విశ్వప్రసాద్, భూషణ్ కుమార్, కృష్ణకుమార్, అభిషేక్ పాఠక్
సంగీతం.. మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫి.. అయనంక బోస్
ఎడిటర్.. ఉజ్వల్ కులకర్ణి
కథ
మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఇన్ కం ట్యాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఉద్యోగంలో భాగంగా ఎన్నో రైడ్స్ చేసి కోట్లలో నల్లధనాన్ని వెలికి తీస్తుంటాడు. ఈక్రమంలోనే ఓ రైడ్ లో అధికారుల మాట విననందుకు సస్పెండ్ అవుతాడు. ఇక సస్పెండ్ తరువాత సొంత ఊరికి వెళ్లిన బచ్చన్ అక్కడ జిక్కీ (భాగ్య శ్రీ బోర్సే) ప్రేమలో పడతాడు. ఆతరువాత జిక్కీ కూడా బచ్చన్ ప్రేమలో పడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుందా అనుకునే టైమ్ లో బచ్చన్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తిస్తారు. వెంటనే ఏ రైడ్ కి వెళ్లాల్సి వస్తుంది. అతనే ఎం.పీ అయిన ముత్యం జగ్గయ్య (జగపతిబాబు). తన రాజకీయ పలుకుబడితో అందరినీ భయపట్టే రకం జగ్గయ్యది. అలాంటి జగ్గయ్య ఇంటిపై రైడ్‌కి వెళ్తాడు బచ్చన్. మరి ముత్యం జగ్గయ్యను మిస్టర్ బచ్చన్ ఎలా ఎదుర్కొంటాడు? ముత్యం జగ్గయ్య ఇంట్లోని నల్లధనాన్ని మిస్టర్ బచ్చన్ పట్టుకుంటాడా? మిస్టర్ బచ్చన్‌ను ఎదుర్కొనేందుకు ముత్యం జగ్గయ్య ఏం చేస్తాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ
హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ అంటే ఆ అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ ఈ సినిమా మొదటి నుండీ మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది. మరోవైపు ఈసినిమా హిందీ లో వచ్చిన రైడ్ సినిమాకు రీమేక్ అని అందరూ అంటున్నా హరీష్ శంకర్ మాత్రం ఆ సినిమాకు ఈసినిమాకు చాలా తేడా ఉందని పలుమార్లు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఒకవేళ రీమేక్ అయినా పర్లేదు అనే పీలింగ్ తో ఉన్న ఆడియన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే హరీష్ శంకర్ నుండి గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా కానీ, గద్దల కొండ గణేష్ సినిమా కానీ రెండూ రీమేక్ లే. కానీ అవి రీమేక్ లు అన్న భావనే లేకుండా తన మార్కు డైలాగ్స్ తో టేకింగ్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్లను అందించాడు. అందుకే ఈసినిమాపై కూడా అంతే నమ్మకంతో ఉన్నారు.
ఇక ఈసినిమా కూడా తనదైన శైలిలో తెరకెక్కించాడని చెప్పొచ్చు. రైడ్ సినిమా కాస్త సీరియస్ గా సాగే సినిమా.. అయితే హరీష్ మన తెలుగు ప్రేక్షకులు ఏం కోరుకుంటారో దానికి తగ్గట్టుగానే తెరకెక్కించాడు. ఆ కథలోని పాయింట్ మాత్రమే తీసుకొని ఇక్కడ రవితేజ కు తగ్గట్టుగా, తెలుగు మార్కెట్ కు తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీ, లవ్ ట్రాక్ అన్నీ జోడించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం రవితేజ ఎంట్రీ.. తన ఎలివేషన్, జిక్కీ తో ప్రేమ, పెళ్లి ట్రాక్, మధ్యలో సత్య కామెడీ ఇలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్ కు వచ్చే సరికి కాస్త సీరియస్ నెస్ ను తీసుకొచ్చాడు. స్టోరీ అంతా ఒకేచోట జరుగుతుంది కాబట్టి బోర్ కొట్టకుండా చాలా జిమ్మిక్కులు చేశాడు హరీష్.. అందులో కొన్ని ఫ్యాన్స్ కి కిక్ ఇస్తాయి కూడా. రవితేజ, జగపతి బాబు మధ్య సీన్స్ బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ నటనతో చెలరేగిపోయాడు. లుక్ పరంగా చూస్తే గత సినిమాలతో పోల్చుకుంటే ఈసినిమాలో ఇంకాస్త హ్యాండ్సమ్ గా కనిపించాడు. రవితేజ బాడీ లాంగ్వేజ్, అమితాబ్‌ని అనుకరిస్తూ చెప్పిన డైలాగులు, డ్యాన్సులు, యాక్షన్ సీక్వెన్స్ అన్నింట్లో మరోసారి తమ మార్క్ నటన చూపించాడు. ఇక ఈసినిమాకు ఇంత క్రేజ్ పెరగడానికి మరో కారణం హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తన లుక్స్, డ్యాన్స్ తో సినిమా రిలీజ్ కు ముందే యూత్ లో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత కమెడియన్ సత్యకు మంచి పాత్ర దక్కింది. ఈసినిమాలో సత్య కామెడీ టైమింగ్ మరోసారి ఆకట్టుకొంటుంది. జగపతి బాబు తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్ తదితరులు తమ పాత్రల మేర బాగానే నటించారు.
టెక్నికల్ టీమ్ కూడా ఈసినిమాకు మంచి ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా మిక్కీ జే మేయర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. ఎప్పుడూ కాస్త మెలోడియస్ పాటలు అందించే మిక్కే జే మేయర్ ఈ సినిమాకు మాత్రం మంచి మాస్ సాంగ్ లు అందించాయి. అవి మంచి బజ్ ను క్రియేట్ చేసి పెట్టాయి. ఇక సినిమాటోగ్రఫి కూడా బాగుంది. వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్లు చాలా బాగుంటాయి. నిర్మాణ విలువలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ ఉందడు.
ఓవరాల్ గా చెప్పాలంటే రవితేజ సినిమా కాబట్టి చాలా మందికి సినిమా చూడాలన్న ఇట్రెస్ట్ ఉంటుంది. రవితేజ అభిమానులకు అయితే ఎలాగైనా నచ్చేస్తుంది. ఇక మిగిలిన వర్గాల వారు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే సినిమా అని చెప్పొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: