నటీనటులు : రామ్ పోతినేని,కావ్య థాపర్,సంజయ్ దత్,సాయాజీ షిండే ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్
సంగీతం : మణిశర్మ
దర్శకత్వం :పూరి జగన్నాథ్ నిర్మాతలు : పూరి జగన్నాథ్, ఛార్మి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామ్ -పూరి జగన్నాథ్ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ అంచనాలను అందుకొని బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది అదే డబుల్ ఇస్మార్ట్.హీరో ,డైరెక్టర్ కు తోడు,ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో హైప్ భారీగా వచ్చింది.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎలా వుంది.అంచనాలు అందుకుని పర్ఫెక్ట్ సీక్వెల్ అనిపించుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ :
మల్టీ మిలీనియర్ అయిన బిగ్ బుల్ (సంజయ్ దత్ )100 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటాడు. అయితే అనుకోకుండా అతనికి బ్రెయిన్ ట్యూమర్ రావడంతో కొన్ని నెలల కంటే ఎక్కువ బ్రతకలేవు అని డాక్టర్లు చెపుతారు.ఈక్రమంలో తన బ్రెయిన్ ను మరొకరి ట్రాన్స్ఫర్ చేసి తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు బిగ్ బుల్.అందుకు శంకర్ (రామ్) ను సెలెక్ట్ చేస్తారు.ఇక ఆతరువాత ఏమైంది? బిగ్ బుల్ మెమోరీస్ వల్ల శంకర్ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనేది మిగితా కథ.
విశ్లేషణ :
ఇస్మార్ట్ శంకర్ స్టోరీ కన్నా ఎక్కువ హీరో క్యారెక్టరైజేషన్ మీదనే నడుస్తుంది. ఇది జనాలకు బాగా నచ్చింది.పూరి సినిమాల్లో హీరోలకు సెపరేట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక తనకు రామ్ లాంటి ఎనర్జిటిక్ హీరో దొరికితే చెప్పనక్కర్లేదు. అందుకే ఇస్మార్ట్ అంత గా హిట్ అయ్యింది. ఇక ఈ సీక్వెల్ లోనూ అదే ఫార్మలా కొనసాగించారు. హీరో క్యారెక్టరైజేషనే సినిమా మెయిన్ పిల్లర్ గా నిలిచింది. ఫస్ట్ పార్ట్ లో లాగే రామ్ తన పని తాను చేశాడు.సినిమాను తన భుజాలమీద మోశాడు.
మదర్ సెంటిమెంట్ తో మూవీ స్టార్ట్ అవ్వగా అక్కడి నుండి వెంటనే బిగ్ బుల్ ఇంట్రో సీన్లకు షిప్ట్ అవుతుంది. ఆ తరువాత శంకర్ ఎంట్రీ ఇవ్వడం,జన్నత్ తో లవ్ ట్రాక్ నడిపే సన్నివేశాలు టైం పాస్ చేయిస్తాయి. ఇంటర్వెల్ ముందు బిగ్ బుల్ మెమోరీస్ శంకర్ కు ట్రాన్స్ఫర్ అవ్వడం తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. అక్కడి నుండి సెకండ్ హాఫ్ ఫై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా డీసెంట్ అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ ,క్లైమాక్స్ ఊహించదగినదే అయినా ఎంగేజింగ్ గా అనిపిస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే ఇస్మార్ట్ శంకర్ లో రామ్ ఎంత ఎనర్జిటిక్ గా కనిపించాడో డబుల్ ఇస్మార్ట్ లోనూ అదే ఎనర్జీ తో కనిపించాడు. యాక్టింగ్ తోపాటు డ్యాన్స్ లో అదరగొట్టాడు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఎక్కడా తగ్గలేదు. శంకర్ పాత్రకు మరోసారి జనాలు ఫిదా అవ్వడం ఖాయం. ఇక హీరోయిన్ గా చేసిన కావ్య థాపర్ గ్లామర్ తోపాటు నటనతోనూ ఆకట్టుకుంది. అలీ అక్కడక్కడా నవ్వించగాసంజయ్ దత్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాడు. తన స్క్రీన్ ప్రజెన్స్ సినిమాకు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. మిగితా పాత్రల్లో నటించిన సాయాజీ షిండే, మకరంద్ దేశ్ పాండే ,గెటప్ శ్రీను, జాన్సీ,ప్రగతి తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపించింది.డైరెక్టర్ గా రైటర్ గా పూరి నిరాశపరచలేదు. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడం లో మ్యూజిక్ కూడా ఓ కారణం.అయితే డబుల్ ఇస్మార్ట్ లో ఆ రేంజ్ ఆల్బమ్ లేదు కానీ సాంగ్స్ డీసెంట్ అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంగేజింగ్ గా వుంది. ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ ఓకే.నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు వున్నాయి.
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ డబుల్ ఇస్మార్ట్ టైం పాస్ చేయిస్తుంది.రామ్ నటన,డ్యాన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి.ఇస్మార్ట్ శంకర్ నచ్చిన వారికి డబుల్ ఇస్మార్ట్ నచ్చుతుంది. మిగితావారు కూడా ఓసారి చూసేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: