మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ప్రతిష్టాత్మకమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అత్యద్భుతమైన గ్రాండియర్‌తో నిర్మాత టి.జి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఇందులో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన మూవీ ప్రమోషనల్ కంటెంట్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో సూపర్ రెస్పాన్స్ అందుకుని హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మిస్టర్ బచ్చన్ ఆగస్టు15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున విడుదల కానుంది. ఈరోజు సాయంత్రం నుంచి మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ వుండబోతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా కర్నూల్‌లో మిస్టర్ బచ్చన్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, డైరెక్టర్ హరీష్ శంకర్ సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ టి.జి.విశ్వ ప్రసాద్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ చెప్పారు. అయితే, మిస్టర్ బచ్చన్ సినిమాకు, పవన్ కళ్యాణ్‌కు సంబంధం ఏంటి, అనుకుంటున్నారా? ఉంది, కాకపోతే ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా.. అదెలా అంటే..? హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. చాలావరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది కూడా.
అయితే గత కొన్ని నెలలుగా పవన్ ఏపీ రాజకీయాలలో బిజీగా ఉండటం, ఇక ఎన్నికల తర్వాత ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో సినిమాలపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతో ఆయన చేస్తున్న పలు సినిమాల షూటింగ్స్ వాయిదాపడ్డాయి. వీటిలో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. అయితే, హరీష్ శంకర్ ఈ సమయంలో రవితేజతో సినిమా పట్టాలెక్కించడానికి సిద్దమయ్యాడు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే, టి.జి.విశ్వ ప్రసాద్ పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్ అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: