నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హైదరాబాద్ లోని సుదర్శన్ 35 MM థియేటర్‌లో భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్య సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. టీజర్ సినిమాలోని రెండు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేయగా, ట్రైలర్ కాన్‌ఫ్లిక్ట్‌ని ప్రజెంట్ చేసింది. గ్రిప్పింగ్ ట్రైలర్ ఇంపాక్ట్ ఫుల్ స్టొరీ మెయిన్ పార్ట్‌ని రివిల్ చేస్తోంది. అదిరిపోయే నెరేటివ్‌తో మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్‌ని కట్టిపడేసింది.
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యాక్టర్ SJ సూర్య మాట్లాడుతూ.. “మీ అందరిని కలవడం ఆనందంగా వుంది. ట్రైలర్‌కి మించి సినిమా వుంటుంది. సినిమా సూపర్‌గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నాని గారు కష్టపడి వచ్చారు. మీ అందరి సపోర్ట్‌తో ఎదిగారు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి” అని అభిలషించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నాని గారు ఈ సినిమాలో శనివారం బాషా టైపు ఉంటారు. డి.వి.వి దానయ్య గారు చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్‌లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ వున్న సినిమా ఇది. మంచి ఎనర్జీ వున్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది” అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































