అమరన్ యాక్షన్ ప్యాక్డ్ మేకింగ్ వీడియో

sivakarthikeyan amaran movie action packed making video released

ఈఏడాది ప్రారంభంలో అయలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు తమిళ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అమరన్. ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది. ఈసినిమాలో కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించే పనిలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఈసినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు చిత్రబృందం. ఈసినిమా నుండి యాక్షన్ ప్యాక్డ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేకింగ్ వీడియో అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంది.

కాగా ఈసినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ మరియు సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా కలిసి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సినిమాటోగ్రాఫర్‌గా సిహెచ్ సాయి పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.