టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌కి తాజాగా చేతికి గాయం అయింది. అయితే దీనికి కారణం ఆయనకు ప్రమాదం జరిగినందువల్లే అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. జూబ్లీహిల్స్‌లో ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదంలో ఆయన ఎడమ చేతి మణికట్టుకు గాయం అయిందని, ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారని, ఇలా రకరకాలుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై తారక్ టీమ్ స్పందించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీమ్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ మేరకు తారక్ టీమ్ ఎక్స్ వేదికగా.. “కొన్ని రోజుల క్రితం జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఎడమ మణికట్టుకు చిన్నపాటి బెణుకు వచ్చింది. అయితే గాయపడినప్పటికీ ఎన్టీఆర్ గత రాత్రి దేవర షూటింగ్ పూర్తి చేశాడు. కానీ గాయం తీవ్రత ఎక్కువ అవ్వడంతో విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. కొన్ని వారాల రెస్ట్ అనంతరం ఆయన కట్టు తీసివేసి తిరిగి పనిలోకి వస్తాడు. ఈలోగా ఈ చిన్న గాయానికి సంబంధించి ఊహాగానాలు నివారించాలని మేము అభ్యర్థిస్తున్నాము” అని అందులో పేర్కొంది.
మరోవైపు ఎన్టీఆర్ సినిమాల అప్‌డేట్ల కోసం తారక్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దేవర చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన పాత్రకు సంబంధించి పార్ట్ 1 షూటింగ్‌ను ముగించాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు తారక్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: