గత ఏడాది సలార్, ఈ ఏడాది కల్కి సినిమాతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ప్రస్తుతం అయితే పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలు లైనప్ లో ఉన్నాయి. వీటిలో రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. సలార్2, స్పిరిట్ సినిమాలు సెట్స్ పైకి వెళ్లడానికి కొంచం టైమ్ పడుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ప్రభాస్ సినిమా చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను కూడా పెట్టబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు ఈసినిమా లాంచింగ్ కు డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు కూడా కథనాలు తెరపైకి వచ్చాయి. ఆగస్టు 17వ తేదీన హైదరాబాద్‌లో ఈసినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాలో కానీ ఇప్పుడు ఈ వార్తలకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఓ సోషల్ మీడియా ద్వారా ప్రభాస్, మృణాల్ ఫస్ట్ లుక్ ఆగష్ట్ 17వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు పోస్ట్ పెట్టగా దానిపై మృణాల్ ఠాకూర్ సైతం స్పందిస్తూ.. సారీ ఫౌజీ చిత్రంలో నేను భాగమవ్వడం లేదు.. అంటూ రిప్లై ఇచ్చింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: