అశ్విన్ రామ్ దర్శకత్వంలో ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ డార్లింగ్. నభా నటేష్ కొంత గ్యాప్ తరువాత ఈసినిమాతో వచ్చింది. అంతేకాదు ఈసినిమా తో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలనుకుంది. ఈనేపథ్యంలోనే ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జులై 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా మంచి విజయాన్ని అందించలేకపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ఓటీటీ రిలీజ్ కు సంబంధించిన అప్ డేట్ ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డీస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు కూడా. ఆగష్ట్ 13వ తేదీన ఈసినిమా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు రానున్నట్టు తెలిపారు. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఈ సినిమాలో అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి, కృష్ణ తేజ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చైతన్య రెడ్డి సమర్పణలో నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రఫీ : నరేష్ రామదురై, సంగీతం : వివేక్ సాగర్, ఎడిటింగ్ : ప్రదీప్ ఇ.రాఘవ్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: