‘ఆయ్’ సినిమా నిర్మాత బన్నీ వాసుకి మంచి సక్సెస్ అందించాలని అభిలషించారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఇలా తెలిపారు.. “నా ప్రియమైన సహచరుడు బన్నీ వాస్ గారు మరియు మా గీతా ఆర్ట్స్ బ్యాండ్‌వాగన్‌లో చేరిన ప్రియమైన సోదరి విద్యా కొప్పినీడికి నా శుభాకాంక్షలు. ఈ ఆయ్ సినిమా నా మనసుకు బాగా దగ్గరైన వారికి అఖండ విజయాన్ని అందించాలని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇటీవలే పిఠాపురంలో సినీ వేడుకను నిర్వహించారు. ఈ సందర్బంగా చిత్ర నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. “ఆయ్.. ఇది పక్కా గోదావరి జిల్లాల సినిమా. రేపు సినిమాను థియేటర్స్‌లో చూసేటప్పుడు ఒక్కరూ కూడా కూర్చోరు. కిందపడి నవ్వుతుంటారు. ప్రేక్షకులందరూ సినిమా థియేటర్ నుంచి బుగ్గలు, పొట్ట నొప్పితో బయటకు వస్తారు. అందుకు నాదీ గ్యారంటీ” అని అన్నారు.
‘మేం ఫ్రెండ్సండి’ అనే ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ చిత్రంలో నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి అంజి కె మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. అయితే అదేరోజున పూరి జగన్నాథ్-రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, అలాగే రవితేజ-హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రాలు కూడా థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్-పా రంజిత్ కాంబోలో తెరకెక్కిన ‘తంగలాన్’ కూడా అదే రోజు విడుదలవుతోంది.
ఇన్ని పెద్ద సినిమాల మధ్య ఆయ్ చిత్రం విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది. అయితే నార్నె నితిన్ సోలో హీరోగా చేస్తోన్న తొలి సినిమా కావడం, మూవీపై కూడా మంచి బజ్ క్రియేట్ అయిన క్రమంలో ఈ చిత్రం విజయంపై నిర్మాతలు చాలా ధీమాగా ఉన్నారు. అలాగే కాన్సెప్ట్ ఓరియెంటెడ్ స్టోరీలే బలంగా మినిమం గ్యారంటీ చిత్రాలను రూపొందించే గీతా ఆర్స్ట్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: