ఆడియన్స్ కు ఎప్పుడు ఏ సినిమా నచ్చుతుందో చెప్పడం చాలా కష్టం. అయితే కథలో కంటెంట్ ఉంటే మాత్రం ఎలాంటి సినిమాను అయినా ఆదరిస్తారని మాత్రం ఎప్పటినుండో నిరూపిస్తూనే ఉన్నారు. అందుకే ఈమధ్యకాలంలో కొత్త కొత్త టాలెంట్ తో వస్తున్న వారు కూడా ఎక్కువయ్యారు. విభిన్నమైన సినిమాలు చేయడానికి సిద్దపడుతున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సినిమా కూాడా ఇదే కోవలోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యదు వంశీ దర్శకత్వంలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నిహారిక కొణిదెల, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వచ్చిన సినిమా కమిటీ కుర్రాళ్లు. ఈసినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేశారు మేకర్స్. అలా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అంతేకాదు ఈమధ్య కాలంలో యాక్షన్, మాస్ సినిమాలు ఎక్కువైపోయాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లు రావడం చాలా అరుదైపోయింది. ఇది కూడా ఈసినిమా విజయానికి ఒక కారణంగా చెప్పవచ్చన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
ఇక ఈసినిమా కు సెలబ్రిటీల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందించి ప్రశంసించారు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఎక్స్ ద్వారా స్పందించారు. కమిటీ కుర్రోళ్ళు ఇంత పెద్ద సక్సెస్ అయినందుకు కాంగ్రాట్చ్యూలేషన్స్ నిహారిక తల్లి..నీ టీమ్ తో పాటు నువ్వు చేసిన హార్డ్ వర్క్, డెడికేషన్ స్పూర్తిదాయకం.. మొత్తం కాస్ట్ అండ్ క్రూకి, డైరెక్టర్ యదు వంశీ కి అభినందనలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
కాగా ఈసినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈసినిమా సినిమాటోగ్రాఫర్ గా ఎదురురోలు రాజు,
ఎడిటర్ గా అన్వర్ అలీ పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: