దివంగత ప్రముఖ నటి, అతిలోకసుందరి శ్రీదేవి 61వ జయంతి నేడు. దీనిని పురస్కరించుకుని ఆమె తనయ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వతహాగా శ్రీవారి భక్తురాలైన జాన్వీ కపూర్ తరచుగా తిరుమల సందర్శిస్తుంటారు. ఇక తల్లి కన్నుమూసిన తర్వాత, ఆమె జయంతి రోజున క్రమం తప్పకుండా ప్రతి ఏడాది తిరుమలను సందర్శించడం జాన్వీ ఆనవాయితీగా కొనసాగిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గతంలో శ్రీదేవి సైతం తిరుమల శ్రీవారిపై విపరీతమైన భక్తి ప్రపత్తులు చాటుకునేవారు. ప్రతి సంవత్సరం తన ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకునేవారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. జాన్వీ వెంట ఆమె స్నేహితుడు శిఖర్ పహారియా ఉన్నాడు. ఇతడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత సుశీల్ కుమార్ షిండే మనవడు కావడం గమనార్హం.
ఈ సందర్భంగా సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయం వచ్చిన వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనం తర్వాత జాన్వీ కపూర్, శిఖర్ పహారియాలకు రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం అధికారులు వీరికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తోన్న ‘దేవర’ చిత్రంలో ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుండగా.. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో రూపొందనున్న చిత్రంలో కూడా జాన్వీ కథానాయికగా నటిస్తోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: