యదు వంశీ దర్శకత్వంలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు కీలక పాత్రల్లో వచ్చిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కమిటీ కుర్రోళ్ళు. సినిమా రిలీజ్ కు ముందే మంచి బజ్ ను క్రియేట్ చేశారు మేకర్స్. అలా ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాకు మంచి టాక్ వస్తుంది. అంతేకాదు సెలబ్రిటీల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది. మొదటి రోజు ఈసినిమా 1.63 కోట్లు మాత్రమే రాబట్టుకుంది.అయితో మంచి మౌత్ టాక్ సొంతం చేసుకుంటుండటంతో రోజు రోజుకూ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. 3రోజుల్లో ఈసినిమా 6.04 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు తాజాగా 4డేస్ కలెక్షన్స్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 7.48 గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టుకుంది.
కాగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్ పై నిహారిక కొణిదెల, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వచ్చిన సినిమా కమిటీ కుర్రాళ్లు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈసినిమా సినిమాటోగ్రాఫర్ గా ఎదురురోలు రాజు, ఎడిటర్ గా అన్వర్ అలీ పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: