మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు నిర్మాత నిహారిక కొణిదెల మీడియాతో ముచ్చటించారు. ఆమె చెప్పిన సంగతులివే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
- కథ విన్నాక ఈ చిత్రంలో నా పేరు మాత్రం కనిపించాలని అనుకున్నాను. ఫీచర్ ఫిల్మ్ చేయాలని అనుకున్న టైంలో అంకిత్ ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది.
- మ్యూజిక్‌తో పాటుగా ఈ కథను నాకు వినిపించారు. అనుదీప్ గారు అప్పటికే మ్యూజిక్ చేసేశారు.
- సిటీలో పుట్టి పెరిగిన నేను జాతర ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. కానీ నాకు కళ్లకు కట్టినట్టుగా వంశీ చూపించాడు. నెరేషన్ అద్భుతంగా ఇచ్చాడు.
- ఓటీటీలో అయినా థియేటర్లో అయినా సినిమా మేకింగ్ ప్రాసెస్ ఒకటే. అందుకే ఈ కథను ఎలాగైనా నిర్మించాలని ఫిక్స్ అయ్యా.
- పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే జాతర చుట్టూ ఈ కథను రాసుకున్నాడు. మూడు తరాలను చూపించేలా ఈ కథ ఉంటుంది. వంశీ గారి పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌లు కూడా ఇందులో ఉన్నాయి.
- వంశీ గారు పవన్ కళ్యాణ్ గారికి అభిమాని. 2019 ఎన్నికల ప్రచార టైంలో జరిగిన విషయాలను కూడా ఇందులో తన స్టైల్లో, కాస్త సెటైరికల్‌గా చూపించారు.
- ముద్దపప్పు ఆవకాయ్ టైంలో నేను నటించాను. ఆ టైంలో నేను అందులో డబ్బులు కూడా పెట్టాను.
- అదే ప్రొడక్షన్ హౌస్ అయింది. కావాలని నిర్మాత అవ్వలేదు. అలా అయిపోయానంతే. నాకు నటించడమే ఇష్టం.
- పదకొండు మంది అబ్బాయిల కారెక్టర్లో నన్ను నేను ఊహించుకొన్నాను. సినిమాను చూసే ప్రతీ ఆడియెన్ ఏదో ఒక కారెక్టర్‌తో ట్రావెల్ చేస్తారు. ప్రతీ ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు.
- టాలెంట్ మాత్రమే కాదు.. క్రమశిక్షణ ఉంటేనే ఇండస్ట్రీలో ఎదుగుతారని చిరంజీవి గారు చెబుతుంటారు. ఆ క్రమశిక్షణ నేను వంశీలో చూశాను. ఆయన సినిమా కోసం చాలా కష్టపడ్డారు.
- మా నాన్నకి కూడా వంశీ నెరేషన్ ఇచ్చారు. మామూలుగానే మా నాన్నకి నచ్చక పోతే వెంటనే లేచి వెళ్లిపోతారు. కానీ వంశీ చెప్పిన కథ మా నాన్నకి కూడా చాలా నచ్చింది.
- మా అన్నా, వదినలు సినిమాను చూశారు. వాళ్లకి సినిమా చాలా నచ్చింది. బయటి వాళ్ల పొగడ్తలు, క్రిటిసిజం పట్టించుకోను. మా అన్న ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటారు.
- ఈ మూవీ చూసి వెంటనే నన్ను పిలిచి అభినందించారు. సెన్సార్ వాళ్లకి కూడా సినిమా బాగా నచ్చింది.
- అంతా కొత్త వాళ్లుంటే.. బిజినెస్‌కు ఇబ్బంది అవుతుందని అన్నాను. కథ వినండి.. విన్న తరువాత చెప్పండని వంశీ అన్నారు. ప్రసాద్ ఒక్కడే అందరికీ తెలిసిన వ్యక్తి.
- వాళ్లంతా కూడా సినిమాతో మూడేళ్లుగా ప్రయాణం చేశారు. ఎవ్వరూ కూడా సెట్స్ మీద డైలాగ్ పేపర్ పట్టుకోలేదు. నేను వాళ్లని ఎంచుకోలేదు.. వాళ్లే నన్ను ఎంచుకున్నారు.
- కమిటీ కుర్రోళ్లు టైటిల్‌ను ముందే ఫిక్స్ చేశారు. నాకు కమిటీ కుర్రోళ్లు అంటే ఏంటో తెలియదు.
- పండుగలు, పబ్బాలు, గొడవలు ఇలా ఏది ఉన్నా కమిటీ కుర్రాళ్లే ముందుంటారని వంశీ చెప్పారు (నవ్వుతూ)
- ప్రతీ ఒక్క పాత్రకు మంచి సీన్స్ ఉంటాయి. ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సీన్‌లో షైన్ అవుతారు.
- ఇక అనుదీప్ ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం. ఆయన ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు, ఆర్ఆర్ ఇచ్చారు. ఈ మూవీకి ఆయనే ప్రధాన బలం.
- మంచి కథలు, కాన్సెప్ట్‌లు, స్క్రిప్ట్‌లకే ప్రాధాన్యం ఇస్తా. పాత్ర బాగుంటే మిగతా అంశాల గురించి అంతగా పట్టించుకోను.
- చిన్న పాత్ర అని, చిన్న హీరో అని కూడా ఆలోచించను. కథ బాగుండి.. పాత్ర నచ్చితే సినిమాల్లో నటిస్తాను.
- వారసత్వం ఉంది కదా అని సినిమాల్లోకి వస్తే సక్సెస్ అవ్వలేరు. సినిమా అంటే ప్యాషన్, ఇష్టం ఉండాలి. ఇండస్ట్రీలో ఎంతో కష్టపడాలి. అప్పుడే విజయం సాధించగలరు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
Niharika Konidela Reacts To Instagram FUNNY Comments | Suryakantham Telugu Movie | Telugu FilmNagar
02:45
Varun Tej and Niharika Konidela Raksha Bandhan Celebrations 2017 | Sreeja | Telugu Filmnagar
01:05
Varun Tej, Niharika Konidela & Naga Babu Cast Their Votes with Family | Telangana Elections 2018
01:02
Suryakantham Movie Best Scenes Back To Back | Niharika Konidela | Rahul | 2019 Latest Telugu Movies
16:08
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: