కేరళలోని వయోనాడ్ లో భారీ వర్షపాతానికి కొండ చరియలు విరిగి పెద్ద విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఈఘటనలో దాదాపు 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఇంకా ఎంతో మంది గాయపడినట్టు తెలుస్తుంది. ఇక తుఫానులు, వరదలు వంటి ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు సెలబ్రిటీలు స్పందించడం కామనే. ఇదిలా ఉండగా ఈ విపత్తుపై కూడా పలువురు సినీ ప్రముఖులు వయనాడ్ బాధితులకు అండగా విరాళాలు అందజేసిన సంగతి కూడా విదితమే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీనిలో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి కోటి రూపాయలు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా చిరంజీవి స్వయంగా కేరళకు వెళ్లడం జరిగింది. త్రివేండ్రంలో విమానాన్ని దిగిన వెంటనే చిరు నేరుగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయానికి వెళ్లి.. అక్కడ సీఎం విజయన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రూ.కోటి రూపాయల చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు.
కాగా ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా.. సురభి ,ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీకి చోటా కె నాయుడు ఫోటోగ్రఫి అందించనున్నారు. ఈసినిమాను వచ్చేే ఏడాది సంక్రాంతికి జనవరి 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: