ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

NTRNeel Movie Launched Grandly Today

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. కేజీఎఫ్‌, సలార్‌ ప్రాంఛైజీలతో గ్లోబల్‌ వైడ్‌గా పాపులర్ అయిన దర్శకుడు ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో కొత్త చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో NTRNeelగా వ్యవహరిస్తోన్న ఈ #NTR 31 చిత్రం శుక్రవారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంచింగ్‌ సెర్మనీ ఘనంగా జరిగింది. దీనికోసం ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ థీమ్‌ ఫొటోలతో డిజైన్‌ చేసిన స్క్రీన్‌ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అలాగే స్టూడియో బయట తారక్‌, ప్రశాంత్‌ నీల్‌ భారీ కటౌట్స్‌ ఆకట్టుకున్నాయి. కాగా ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది. దీనికి సంబంధించి మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన కూడా చేసేసారు.

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తారక్‌ ఫ్యామిలీతో సహా రావడం గమనార్హం. తార‌క్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. భార్య లక్ష్మీ ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతుంది. ఎన్టీఆర్ తనయుడు, అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భార్య లిఖిత, కుమారుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా ప్రశాంత్ నీల్ గత సినిమాలకు సంగీతాన్ని అందిస్తున్న రవి బస్రూర్ ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే గత కొన్నేళ్లుగా నీల్‌తో కలిసి ట్రావెల్ చేస్తోన్న భువన గౌడ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ విజన్‍ని బిగ్ స్క్రీన్‍పై అద్భుతంగా ప్రజెంట్ చేయడంలో.. ఆ విజువల్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడంలో వీరిద్దరి పాత్ర ప్రముఖంగా వుంటుంది.

ఇక ఇదిలావుంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్‌ను ముగించే పనిలో ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న దేవర ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అయితే ఈ మూవీ విడుదల కాకముందే ఎన్టీఆర్‌ 31 (NTR 31) పట్టాలెక్కించడం విశేషం.

కాగా ప్రశాంత్ నీల్ సలార్‌ 2 సినిమా తీయాల్సి ఉంది, మరోవైపు తారక్‌ బాలీవుడ్ ఫిల్మ్ వార్‌ 2ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల షెడ్యూల్‌ను బట్టి ఎన్టీఆర్‌ 31 రెగ్యులర్‌ షూటింగ్‌పై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం వుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ భారీ బ‌డ్జెట్‌తో తెరకెక్కిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.