ఎప్పటినుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూసిన తలైవా రజినీకాంత్ కు జైలర్ సినిమాతో మంచి హిట్ దక్కింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా గత ఏడాది ఆగస్ట్ 10వ తేదీన రిలీజ్ అయింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. 600 కోట్లకు పైగా ఈసినిమా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఈసినిమాకు సీక్వెల్ వస్తున్నసంగతి తెలిసిందే కదా. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇవ్వనున్నారు. ఇక ఇటీవల జైలర్ 2 గురించి జైలర్ లో నటించిన యోగిబాబు ఒక అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా స్క్రిప్ట్ ను నెల్సన్ రెడీ చేస్తున్నాడని.. తన పాత్ర ప్రత్యేకంగా నిలిచిపోయేలా ఉండనుందని తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు జైలర్ 2 గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే ఈ సీక్వెల్ కు టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. హుకుం టైటిల్‌ను దాదాపుగా ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. మరి జైలర్ సినిమాలో హుకుం పాట ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ పదాన్నే టైటిల్ గా తీసుకొని పెట్టడం ఈసినిమాకు కలిసొస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.
కాగా జైలర్ సినిమాలో ఇంకా రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, యోగిబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అంతేకాదు శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: