సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కు, కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో హరీష్ శంకర్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి ఏమైనా కామెంట్లు వస్తే ఏమాత్రం తగ్గకుండా సమాధానమిస్తుంటాడు. ఈనేపథ్యంలోనే తాజాగా మరో వివాదంపై
స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇకఈసినిమాలో రవితేజ కు జోడీగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ గురించి పలు కామెంట్స్ వచ్చాయి. దీంతో ఈ వార్తలపై హరీష్ శంకర్ స్పందిస్తూ.. యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించడు. సినిమాలో 25 ఏండ్ల అమ్మాయిని కూడా 50 ఏండ్ల వ్యక్తి అని నమ్మించేలా చేయాల్సి వస్తుంది. ఇది నటన. అయితే స్క్రీన్‌పై వయస్సు అనేది కొంత ఉంటుంది. హీరోయిన్ కు అన్నీ తెలిసే సినిమాకు సంతకం చేస్తుంది.. వాళ్లకు లేని అభ్యంతరం ఇతరులకు ఎందుకు.. ఎన్టీఆర్, శ్రీదేవి ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు.. ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు.. ధమాకా హిట్ అయింది కాబట్టి ఏంలేదు.. సెలైంట్ గా ఉన్నారు.. అదే ఫ్లాప్ అయితే చిన్న అమ్మాయిని తీసుకోవడం వల్లే జరిగిందని కామెంట్స్ చేసేవాళ్లు.. ఇలా డబుల్ స్టాండర్డ్ గా మాట్లాడే వాళ్లంటే నాకు ఇష్టం ఉండదు అంటూ గట్టి కౌంటరే ఇచ్చాడు.
కాగా ఈసినిమాలో ఇంకా జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, వైవా హర్ష, నెల్లూరు సుదర్శన్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: